Suriya Viral : క్రియేటివిటీకి పెట్టింది పేరు తమిళ సినీ ఇండస్ట్రీ. ఇక్కడ దర్శకులు టాప్. వారి క్రియేటివిటీ, టేకింగ్ , మేకింగ్ విషయంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. ఇక హీరోలను మరింత ఆకర్షణీయంగా , అర్థవంతంగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారారు హీరో సూర్య. ఆయన కోసం కెమెరాలు క్లిక్ మనిపించేలా ఉన్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పాత్రలను ఎంపిక చేసుకోవడంలో, సినిమాలు చేయడంలో , దర్శకులకు అనుగుణంగా తనను తాను మల్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు హీరో సూర్య. ఆయన అసలు పేరు శరవణన్ శివకుమార్. విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందాడు. సూర్య(Surya) . రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
1997లో నెరుక్కు నేర్ లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు సూర్య.. సూర్య నందా , కాఖా కాఖా , పితామగన్ , పెరాజాగన్ సినిమాలు బాక్సాఫీసు బద్దలు కొట్టాయి. ఇదే సమయంలో సూర్య నటించిన సింగం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో రెండు సింగం -2, సింగం-3 వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఓం అరివు విజయం సాధించాయి. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా అద్భుతమైన హీరో గా గుర్తింపు పొందారు.
Also Read : Vijay Sai Reddy : మాదే అధికారం జగనే సీఎం
