Bhagat Singh (A revolutionary warrior): దేశం కోసం తన యవ్వనాన్ని ధార పోసిన వాడు. ఉరి కొయ్యలను ముద్దాడిన వాడు. ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన యోధుడు. విప్లవ వీరుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్.
ఇవాళ ఆయన వర్దంతి. 28 సెప్టెంబర్ 1907లో పుట్టాడు. సరిగ్గా ఇదే రోజు 1931 మార్చి 23న ఉరి కొయ్యలను ముద్దాడాడు.
ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి జనాన్ని చైతన్యవంతం చేశాడు (Inquilab Zindabad).
మొదటిసారిగా ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదం ఇచ్చింది భగత్ సింగే(Bhagat Singh ).
భారత జాతి విముక్తి కోసం జరిగిన పోరాటంలో పోరాడిన యోధుల్లో (Shaheed) షహీద్ ఒకడు. దేశంలో మొట్టమొదటి మార్క్సిస్టుగా పేరొందాడు.
విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. విప్లవాత్మక సంస్థలలో సభ్యుడు.
హిందూస్థాన్ గణతంత్ర సంఘంలో సభ్యుడయ్యాడు. దానిని హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చాడు.
భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు ఉండాలని డిమాండ్ చేస్తూ 64 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టాడు.
సమర యోధుడు లాలా లజపతి రాయ్ హత్య కేసులో ఒక పోలీస్ అధికారిని చంపాడు.
దీంతో భగత్ సింగ్ ను ఉరి తీశాడు. ఆనాటి నుంచి నేటి దాకా దేశంలోనే అత్యంత ప్రభావశీల యోధుడిగా భగత్ సింగ్ నిలిచాడు.
ఏం చేస్తున్నావ్ అని అడిగిన తండ్రికి తుపాకులు నాటుతున్నానని జవాబు ఇచ్చి ఆశ్చర్య పరిచాడు భగత్ సింగ్(Bhagat Singh ).
ఆయనపై తాత అర్జున్ సింగ్ ప్రభావం ఉంది. 13 ఏళ్ల వయసులో గాంధీ సహాయ నిరాకరోణద్యమం ప్రభావితం చేసింది.
అనంతరం విప్లవోద్యమాన్ని అనుసరించాడు భగత్ సింగ్. 1923లో హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు.
పంజాబ్ సాహిత్యాన్ని అవపోసన పట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన కవితలు, సాహిత్యాన్ని చదివాడు.
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంటి నుంచి పారి పోయి భారత యువజన సంఘంలో చేరాడు.
1928లో విప్లవకారులతో కూడిన కీర్తి కిసాన్ పార్టీ సమావేశంలో పాల్గొన్నాడు.
రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేశాడు. సాండర్స్ ను కాల్చి చంపాడు.
విప్లవకారులను అణచి వేసేందుకు ఆంగ్ల ప్రభుత్వం ఓ చట్టం తీసుకు వచ్చింది.
దీనిని నిరసిస్తూ భగత్ సింగ్ తో పాటు దత్ లు కేంద్ర శాసనసభపై బాంబు విసిరారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు.
పేలుడుపై భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లపై అభియోగం మోపింది ఆంగ్ల సర్కార్.
కోర్టులో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. డైరీ రాసే అలవాటు భగత్ సింగ్ కు ఉంది.
తాను సమర్థించే ప్రముఖుల ఉదాహరణలు, వారి గొప్ప వాక్యాలకు సంబంధించి రాశాడు.
నేను ఎందుకు నాస్తికుడిని అయ్యానంటూ రాసిన వ్యాసం ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది.
1931 మార్చి 3న భగత్ సింగ్ తో పాటు సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను లాహోర్ లో ఉరి తీశారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగా ఉరి తీశాడు.
ఆనాటి నుంచి భగత్ సింగ్ (Shaheed) షహీద్ గా పిలుస్తున్నారు. అంతకు ముందు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు (Inquilab Zindabad).
Also Read : సమన్వయ లోపం కాంగ్రెస్ కు శాపం