Himaja : బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ షో సెన్సేషన్. ఈ షోతో మరింత పాపులర్ అయిన హిమజపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగింది. ఆమె విడాకులు ఇస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై హిమజ (Himaja )పూర్తి క్లారిటీ ఇచ్చారు. అందరి లాగానే హిమజ కూడా సోషల్ మీడియాలో అలర్ట్ గా, యాక్టివ్ గా ఉంటారు. తనకంటూ స్వంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హిమజ(Himaja )టాప్ లో నిలిచింది. ఆమెకు సంబంధించి వస్తున్న ప్రచారంతో తట్టుకోలేక ఇవాళ తానే ముందుకు వచ్చింది.
ఇదే ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఎలా విడాకులు ఇస్తానంటూ ఎదురు ప్రశ్న వేసింది.
తాను ఇప్పటికీ సింగిల్ గా నే ఉన్నానని స్పందించ కూడదని అనుకున్నానని కానీ తన పేరెంట్స్ కు తెలిసి బాధ పడతారని అందుకే ఈ వీడియోతో క్లారిటీ ఇస్తున్నానని చెప్పింది.
ప్రస్తుతం హిమజ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తాను కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, తనకు తన వృత్తి తప్ప వేరే ధ్యాస లేదని స్పష్టం చేసింది. పనిలో పనిగా సంచలన కామెంట్స్ కూడా చేసింది.
యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు చేసేసి ఎంచక్కా విడాకులు కూడా ఇస్తున్నారంటూ పేర్కొంది. తనకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదని నాలుగేళ్లు ఆగాక చేసుకుంటాని చెప్పింది.
అంతలోపు ఎవరైనా మంచి వరుడు ఉంటే చెప్పండింటి అంటూ హిమజ సూచించింది.
Also Read : దిల్ హరీష్’ ఏటీఎం వెబ్ సీరీస్