Third Test Moved : మూడో టెస్టు వేదిక మార్పు – బీసీసీఐ
వాతావరణం అనుకూలించక పోవడం
Third Test Moved : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. మూడో టెస్టు వేదికలో మార్పు చసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు(Third Test Moved) మ్యాచ్ ఆస్ట్రేలియాతో ధర్మశాలలో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు సోమవారం అధికారికంగా బీసీసీఐ ఆసక్తికర వార్త వెల్లడించింది.
ఇందులో భాగంగా ధర్మశాలలో మూడో టెస్టు మ్యాచ్ ఉండదని స్పష్టం చేసింది. ఈ మూడో టెస్టు 1 నుంచి 5 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ ను ధర్మశాలలో నిర్వహించడం లేదని పేర్కొంది. దీనిని ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్చినట్లు తెలిపింది బీసీసీఐ. అధికారికంగా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంను బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ సందర్శించారు. స్టేడియం చుట్టూ తిరిగారు. అవుట్ ఫీల్డ్ ను పరిశీలించారు. పూర్తి నివేదికను బీసీసీఐకి సమర్పించారు. ఇందులో వాతావరణం టెస్టు మ్యాచ్ నిర్వహణకు సరిపోదంటూ పేర్కొన్నారు తపోష్ ఛటర్జీ.
ఇక ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ లో మొదటి మ్యాచ్ నాగ్ పూర్ లో జరిగింది. భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు ఢిల్లీలో జరగనుంది. చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లో చేపడుతుంది బీసీసీఐ.
ధర్మశాలలో మ్యాచ్ జరిగేందుకు వీలు లేదని రిపోర్టులో పేర్కొన్నారు. చల్లటి వాతావరణం, ఔట్ ఫీల్డ్ లో ఆడేందుకు వీలు పడదని తెలిపింది.
Also Read : విరాట్ కోహ్లీ నాకు స్పూర్తి – జెమీమా