Harish Rawat : కాంగ్రెస్ కు అత‌డే బ‌లం కీల‌కం

హ‌రీష్ రావ‌త్ మామూలోడు కాదు

Harish Rawat : రాజ‌కీయం అంటే మామూలు విష‌యం కాదు. ఒక ర‌కంగా చ‌ద‌రంగం లాంటిదే. ఈ భిన్న‌మైన ఆట‌లో ఎవ‌రు ఎప్పుడు స్టార్ అవుతారో ఇంకెప్పుడు అధః పాతాళానికి చేరుకుంటారో చెప్ప‌లేం.

సినిమా, రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌న్నీ ఒక్క‌టే. రంగాలు వేరైనా ఒక్క‌సారి దానిలోకి ఎంట‌ర్ అయ్యారంటే ఇక వెన‌క్కి వెళ్ల‌లేరు.

ఎందుకంటే ఆ రంగాలు అత్యంత పాపుల‌ర్ రంగాలు. వెన‌క్కి వెళ్లి మ‌ళ్లీ తిరిగి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

ఇక్క‌డ క్లిక్ కావాలంటే ఎన‌లేని వ్యూహాలు ప‌న్నాలు. ప్ర‌త్య‌ర్థులు ఒక అడుగు ముందుకు వేస్తే వారి ఆలోచన‌ల్ని ప‌సిగ‌ట్టి వారికంటే మ‌రో అడుగు ముందుకు వేయ‌గ‌లిగే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండాలి.

అలాంటి కోవ‌లోకి వ‌స్తారు ఉత్త‌రాఖండ్ కు చెందిన కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు హ‌రీష్ రావ‌త్(Harish Rawat).

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు. ఆ పార్టీకి ఆయ‌నే బ‌లం కీల‌కం బ‌ల‌హీన‌త కూడా.

ఈ రాష్ట్రానికి మ‌రో పేరు కూడా దేవుళ్లు న‌డ‌యాడే భూమిగా పేరుంది. ఆయ‌న‌ను కాద‌ని పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకునే స్థితిలో లేదు. గ‌తంలో ఇందిరా గాంధీ ఉన్న‌ప్పుడు పార్టీ ప‌రిస్థితి వేరు.

ఆనాడు ఆమె చెప్పిందే వేదం అదే చ‌ట్టం..శాస‌నం కూడా. కానీ ఇప్పుడు సీన్ మారింది. నేత‌లు చెప్పిందే హైక‌మాండ్ వినే స్థితికి దిగ‌జారింది. ప్ర‌స్తుతం ఈ దేవ‌భూమి ఎన్నిక‌ల‌కు సిద్ద‌మైంది.

తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ద‌ప‌డ్డాయి. కాంగ్రెస్ రావ‌త్ ను న‌మ్ముకుంటే బీజేపీ మోదీని ముందు పెట్టి న‌డుస్తోంది. అన్ని స‌ర్వేలు కాస్తా క‌ష్ట‌ప‌డితే పార్టీ గ‌ట్టెక్క వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో రావ‌త్ మ‌రింత దూకుడు పెంచారు.

త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. 1948లో పుట్టిన రావ‌త్ ఏది మాట్లాడినా ఓ సంచ‌ల‌న‌మే. 1980లో ఆల్మోరా నుంచి ఎంపీగా గెలిచారు. 1989 దాకా మూడు సార్లు ఎంపీగా త‌న ప‌ట్టు నిలుపుకున్నారు.

2000 ఉత్త‌రాఖండ్ పీసీసీ చీఫ్ గా ఎన్నిక‌య్యారు. 2002 నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. 2009లో ఎంపీగా గెలిచారు. 2009-14 దాకా కేబినెట్ మంత్రిగా ఉన్నారు. 2014లో రావ‌త్ (Harish Rawat)సీఎంగా ఆశీనుల‌య్యారు.

2016లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగు బాటు చేశారు. దీంతో రావ‌త్ (Harish Rawat)స‌ర్కార్ మైనార్టీలో ప‌డ‌డంతో అక్క‌డ ప్రెసిడెంట్ రూల్ విధించారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.

స‌త్తా చాటారు సీఎంగా ఎన్నిక‌య్యారు రావ‌త్. 2017లో కాంగ్రెస్ ఓడి పోయింది. పంజాబ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్ గా ఉన్నారు. అక్క‌డ విఫ‌ల‌మ‌య్యార‌ని పార్టీ భావించింది.

కానీ ఉత్త‌రాఖండ్ లో మ‌రో బ‌ల‌మైన, శ‌క్తివంత‌మైన నేత లేక పోవ‌డంతో చివ‌ర‌కు రాహుల్ గాంధీ రావ‌త్ వైపు మొగ్గు చూపారు.

Also Read : చ‌తేశ్వ‌ర్ పుజారా వెరీ స్పెష‌ల్

Leave A Reply

Your Email Id will not be published!