Rohit Sharma Top : ఐపీఎల్ సంపాద‌న‌లో హిట్ మ్యాన్ టాప్

రెండో స్థానంలో ఝార్ఖండ్ డైన‌మిట్

Rohit Sharma Top : ప్రపంచ క్రికెట్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన రిచ్ లీగ్ గా పేరొందింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్). టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి వ‌న్డే వ‌ర‌కు సాగిన ప్ర‌యాణంలో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త సుశీల్ మోడీ. ఐపీఎల్ కు శ్రీ‌కారం చుట్టింది అత‌డే.

అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో యుకెలో సేద దీరుతున్నాడు. కానీ ఐపీఎల్ మాత్రం రోజు రోజుకు ఆద‌ర‌ణ పొందుతూనే ఉంది. ఈ ఒక్క లీగ్ తో సామాన్యులు సైతం క‌రోడ్ ప‌తులు అవుతున్నారు. మొద‌ట‌గా ఐపీఎల్ 2008లో ప్రారంభ‌మైంది. ఆనాటి నుంచి నేటి దాకా కొన‌సాగుతూ వ‌స్తోంది.

తాజాగా ఐపీఎల్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ఆట‌గాళ్లు ఎవ‌రు, వారి సంపాద‌న ఎన్ని కోట్లు ఉంద‌నే దానిపై లిస్టు విడుద‌లైంది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ కు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అత‌డి సార‌థ్యంలో ఏకంగా ఐపీఎల్ ఛాంపియ‌న్ గా ఐదు క‌ప్పులు గెలిచింది. ఇక ధోనీ సార‌థ్యంలో నాలుగు సార్లు క‌ప్పులు గెలుపొందాడు.

మొత్తం 16 సీజ‌న్ల‌లో రోహిత్ శ‌ర్మ(Rohit Sharma Top) ఏకంగా రూ. 178.6 కోట్లు వేత‌నంగా పొందాడు. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ సార‌థి 176.84 కోట్ల‌తో నిలిచాడు. ఇక మూడో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. రూ. 173.2 కోట్లు సంపాదించాడు. సీఎస్కేలో ఉన్న సురేశ్ రైనా రూ. 110 కోట్లు , జ‌డేజా రూ. 109 కోట్లతో త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు.

గౌత‌మ్ గంభీర్ రూ. 94 కోట్లు సంపాదిస్తే విదేశీ ఆట‌గాళ్ల‌లో సునీల్ రూ. 107 కోట్లు సంపాదించ‌గా డివీలియ‌ర్స్ రూ. 102 కోట్లు స్వంతం చేసుకున్నాడు.

Also Read : పంత్ ప్ర‌ముఖ క్రికెట‌ర్ అని తెలియ‌దు

Leave A Reply

Your Email Id will not be published!