Rohit Sharma : హిట్ మ్యాన్ స్ట‌న్నింగ్ లుక్ అదుర్స్

రోహిత్ శ‌ర్మ ఫోటో నెట్టింట్లో వైర‌ల్

Rohit Sharma : నెట్టింట్లో ఎప్పుడు ఎవ‌రు వైర‌ల్ గా మారుతారో చెప్ప‌లేం. నిన్న‌టికి నిన్న జ‌డేజా త‌గ్గేదే లే అన్న డైలాగ్ తో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇవాళ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ ప్లేయ‌ర్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఇదిలా ఉండ‌గా ప్రాక్టీస్ చేస్తుండ‌గా రోహిత్ శ‌ర్మ‌కు(Rohit Sharma) తీవ్ర గాయామైంది. దీంతో సౌతాఫ్రికా టూర్ కు సంబంధించి వ‌న్డే, టీ20 కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ దూర‌మ‌య్యాడు.

అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. ఈ త‌రుణంలో బెంగ‌ళూరు లోని ఇండియ‌న్ క్రికెట్ అకాడ‌మీలో ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నాడు.

ఈ స‌మ‌యంలో మ‌నోడు త‌న కొత్త ఫోటోను త‌న అభిమానుల కోసం పంచుకున్నాడు. స‌న్న‌గా మారి పోయి క్లీన్ షేవ్ తో హీరో లాగా మారి పోయాడు. న్యూ లుక్ కు సంబంధించిన పిక్ ను త‌నే పోస్ట్ చేశాడు.

ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ అవుతోంది. ఎక్క‌డ చూసినా రోహిత్ సూప‌ర్ అంటున్నారు క్రికెట్ అభిమానులు. అటు ఫ్యాన్స్ తో పాటు భార్య రితికా స‌జ్జే ,

తాజా మాజీ ఆట‌గాళ్లు సైతం రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) లుక్ ను కీర్తించారు. అచ్చం హీరో లాగా ఉన్నాడంటూ కితాబు ఇచ్చింది భార్య‌. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : బీసీసీఐ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Leave A Reply

Your Email Id will not be published!