Tirumala Rush : భక్త జన సందోహం తిరుమల క్షేత్రం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు
Tirumala Rush : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గత రెండు రోజులుగా కొంత మేరిన తగ్గిన భక్తులు ఉన్నట్టుండి శుక్రవారం ఏకంగా భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 82 వేల 999 మంది దర్శించు కోవడం విశేషం.
ఇదిలా ఉండగా స్వామి వారికి 38 వేల 875 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చారు కలియుగ దైవం కొలువు తీరిన పుణ్య క్షేత్రానికి. కాగా క్షేత్రంలో ఉన్న మొత్తం కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండి పోయాయి.
దీంతో టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు కనీసం 20 గంటలకు పైగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. ఊహించని రీతిలో తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ విస్తృతంగా చర్యలు చేపట్టింది.
దేవస్థానం పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి, కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డిలు, జేఈవో సుధా బార్గవి దగ్గరుండి పర్యవేక్షించారు. చిన్నారులు, వృద్దులకు త్వరగా దర్శనం అయ్యేలా చేశారు.
Also Read : Jay Shah Comment : ‘జే షా’ బీసీసీఐకి బాద్ షా