#Telangana : రంగారెడ్డి జిల్లా… రైతు పొలంలో భారీ వజ్రం

ధృవీకరించిన నిపుణులు , ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

Telangana: ఆ రైతు పొలం దున్నుతుండగా ఈ వజ్రం బయటపడింది. అయితే తను తెలివైన వాడు కావడంతో కొందరికి చూపించాడు. వాళ్లు ఇది వజ్రమే అని చెప్పారు. ఇంకా సంక తీరకపోవడంతో హైదరాబాద్ లోని ల్యాబ్ లో పరీక్షలు చేయించాడు. వాళ్లు కూడా ఇది వజ్రమేనని తెలిపారు. వాళ్లిచ్చిన నివేదికలను పట్టుకొని..వజ్రాలను అధ్యయనం చేసే ఒక ప్రొఫెసర్ కు చూపించాడు. ఆయన కూడా ఇది వజ్రమేనని తెలిపారు. దాంతో ఆ రైతు ప్రొఫెసర్ కాళ్లావేళ్లా పడి బతిమాలాడాడు. ప్రభుత్వానికి తెలిస్తే తీసేసుకుంటుందని, పిల్లలు కలవాడిని, పేదవాడిని అని చెప్పి బతిమాలు కోవడంతో అతను విషయాన్ని బయటపెట్టలేదు.

తర్వాత సంగతి బయటకు వచ్చింది. అయితే 40ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరికాయి. అప్పుడు జీఎస్ ఐ ఆధ్వర్యంలో చాలా ఏళ్లు సర్వేలు చేశారు. అప్పట్లో తేలినదేమిటంటే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల మధ్య కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించి నిధులున్నట్టు దీనిపై జీఎస్ఐ సర్వే చేయాలని ఉస్మానియా యూనివర్శటీ ప్రొఫెసర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

ఆ వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలో రామడుగు, చండూరు, గుర్రంపోడులో ఇంకా మిర్యాలగూడలోని ఉట్లపల్లి తదితర ప్రాంతాల్లో వజ్ర నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. అయితే కేంద్రం స్పందించి రాష్ట్రానికి సూచించింది. ఈలోపు రైతు పొలంలో వజ్రం దొరికింది. వీళ్లు ఇలా ఏళ్లకు ఏళ్లు మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే ఇప్పటికి ఎన్ని పోయాయో..ఇంకా ఎన్నిపోతాయో కూడా తెలియదని కొందరు సెలవిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!