Huge Security IPL 2022 : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ
హాజరు కానున్న అమిత్ షా , భూపేంద్ర పటేల్
Huge Security IPL 2022 : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో, మరింత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కోట్లాది ప్రజలు గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2022 ఫైనల్స్ మ్యాచ్ ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
వరల్డ్ వైడ్ గా చూస్తే అత్యధిక కెపాసిటీ కలిగిన అతి పెద్ద స్టేడియం భారత్ లోని మోదీ స్టేడియం పేరు తెచ్చుకుంది.
కాగా రాజస్తాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ ను ఏకంగా లక్షా 10 వేల మంది ప్రత్యక్షంగా స్టేడియంలో చూశారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా ఫుల్ అయి పోవడం ఖాయం. ఇదిలా ఉండగా ఈసారి ఫైనల్ మ్యాచ్ కు మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. కారణం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోదీ స్టేడియంకు రానున్నారని సమాచారం.
దీంతో పెద్ద ఎత్తున భదత్రా బలగాలు(Huge Security IPL 2022) మోహరించారు. ప్రధాన మంత్రితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్టేడియంకు ప్రధానితో పాటు హాజరవుతారని టాక్.
స్టేడియం లోపట వెలుపల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏకంగా రాష్ట్ర సర్కార్ 6,000 వేల మంది భద్రతా సిబ్బందిని(Huge Security IPL 2022) ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా 17 మంది డీసీపీలు, 4 డీఐజీలు, 28 ఏసీపీలు, 51 మమంది సబ్ ఇన్స్ పెక్టర్లు , 288 ఎస్ఐలు, 5 వేల మందికి పైగా కానిస్టేబుళ్లు, 1,000 మంది హోం గార్డులు, మూడు కంపెనీల ఎస్ఆర్పీలు బందోబస్తులో పాల్గొంటారని సిటీ కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Also Read : చరిత్ర సృష్టించిన సూపర్ నోవాస్