Hurun India List 2022 : దేశంలో విలువైన కంపెనీలు ఇవే
ప్రకటించిన హురూన్ ఇండియా
Hurun India List 2022 : దేశంలో ఏయే కంపెనీలు ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి. అవి ఎలా వృద్ది చెందాయి. ఆయా కంపెనీలు అనుసరించిన పద్దతలు ఏంటి. సక్సెస్ కావడానికి గల కారణాలు ఏమిటి అనే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఏటా హురూన్ ఇండియా జాబితా ప్రకటిస్తూ వస్తుంది.
తాజాగా ఈ ఏడాది 2022కి సంబంధించి లిస్టును విడుదల చేసింది. ఇదిలా ఉండగా మార్కెట్ లో లిస్టు అయిన కంపెనీలు వాల్యూయేషన్ , లిస్ట్ కాని కంపెనీల మార్కెట్ వాల్యూ ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు హురూన్ ఇండియా(Hurun India List 2022) ప్రకటించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రతి కంపెనీ కనీసం మార్కెట్ వాల్యూ రూ. 6,000 కోట్లుగా ఉంటేనే పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 500 కంపెనీలలో దాదాపు 50 కంపెనీలు కేవలం 10 సంవత్సరాలలోనే ఈ ఫీట్ సాధించినట్లు స్పష్టం చేసింది హురూన్ ఇండియా.
రూ. 17,25,058 కోట్లతో రిలయన్స్ గ్రూప్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఇక లిస్టు కాని కంపెనీల్లో సీరమ్ టాప్ లో నిలిచింది. దీని మార్కెట్ వాల్యూ రూ. 2,19,700 కోట్లు అని పేర్కొంది. ఇక మూడవ స్థానంలో వేదాంత్ ఫ్యాషన్స్ టాప్ లో నిలిచింది. రూ. 1,82,000 కోట్లతో అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా బైజూస్ నిలిచింది.
అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న కంపెనీలలో రిలయన్స్ టాప్ లో ఉంది. ప్రతి సంవత్సరానికి రూ. 16,297 కోట్లు కడుతోంది. ఇక 5వ స్థానంలో టాటా గ్రూపు చోటు దక్కించుకుంది. ఆ గ్రూప్ లో 15 కంపెనీలు ఉన్నాయి. ఒక్క టీసీఎస్ కిందనే 5,92,195 మంది ఎంప్లాయిస్ పని చేస్తుండడం విశేషం.
ఉద్యోగాల కల్పనలో టాటానే టాప్ లో ఉంది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీల విలువ ఏడాదికి రూ. లక్ష కోట్ల చొప్పున పెరగడం విశేషం. హెల్త్ కేర్, సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ , కెమికల్స్ , ఫార్మా సెక్టార్లకు చెందిన కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ నుంచి 31 కంపెనీలు ఉన్నాయి.
Also Read : ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయి స్టార్ట్