Bandi Sanjay : హుస్సేన్ సాగర్ కాదది వినాయక్ సాగర్
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు తెర లేపారు. భాగ్యనగరంలో ఉన్నది హుస్సేన్ సాగర్ కాదని అది వినాయక్ సాగర్ అని , ప్రతి ఒక్క హిందువు అలాగే పిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని హిందువుల పండుగలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు బండి సంజయ్.
ఇక నుంచి ఎవరూ కూడా హుస్సేన్ సాగర్ అని పిలువ కూడదని అలా పిలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. వినాయక్ సాగర్ సరస్సులో వినాయక నిమజ్జనం జరుగుతుందని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్.
గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మండిపడ్డారు బండి సంజయ్.
ఓ వైపు హిందువులు కష్ట పడుతుండగా దారుసల్లాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో వేడుకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్.
రెండు రోజుల్లో పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరగబోతున్నాయి. కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉదయం కొన్ని క్రేన్లు మాత్రమే అమర్చారు.
అవి ఇంకా పని చేయలేదు. గత ఏడాది సుమారు 60 క్రేన్లను అమర్చారు. హిందువులు ఈ పరిస్థితి గురించి ఆలోచించాలన్నారు. మంత్రి కేటీఆర్ కు పండుగలంటే నమ్మకం లేదని ఫైర్ అయ్యారు.
Also Read : ఆ రోజుల్లో శ్రీవారి ఆలయం బంద్