HYD Rains : భాగ్య నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం
ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి...
HYD Rains : ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం(HYD Rains) కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మలక్‌పేట్, చార్మినార్, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లపై నిలిచిపోయింది. బంజారాహిల్స్, పంజాగుట్టలో వాన దంచికొట్టడంతో నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్(Hyderabad) సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా మూడు గంటల తర్వాత వాతావరణంలో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం గంట పాటు ఎకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది.
HYD Rains Update
ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలో ఇవాల్టి నుంచి రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, కృష్ణా, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాద్‌లో శుక్రవారం వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ శాఖ హెచ్చరికతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : Minister Bandi Sanjay : మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్యలు