Ajinkya Rahane : ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటా – రహానే
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తర్వాత అజింక్యా కామెంట్స్
Ajinkya Rahane : ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై ఘన విజయాన్ని సాధించింది. ఆ జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడితే రెండింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 157 రన్స్ చేసింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆది లోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ కాన్వే పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసిక్ బ్యాటర్ గా పేరొందిన 34 ఏళ్ల అజింక్యా రహానే ఎవరూ ఊహించని రీతిలో చెలరేగాడు. ఆకాశమే హద్దుగా దుమ్ము రేపాడు. పేసర్లు, స్పిన్నర్లు అని చూడకుండా సిక్సర్లు, ఫోర్లతో చుక్కలు చూపించాడు.
కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రహానే(Ajinkya Rahane) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వేరే వాటి గురించి ఆలోచించనని చెప్పాడు. పాజివిట్ దృక్ఫథంతో ఉంటానని గెలుపు ఓటములను సమానంగా చూస్తానని స్పష్టం చేశాడు అజింక్యా రహానే.
Also Read : హైదరాబాద్ గెలిచేనా కావ్య నవ్వేనా