Shadab Khan : పాకిస్తాన్ ఓటమికి నేనే కారణం – షాదాబ్ ఖాన్
తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా
Shadab Khan : యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 ఫైనల్ లో శ్రీలంక చేతిలో పాకిస్తాన్(SL vs PAK Asia cup – 2022) ఓటమి పాలైంది. ఆరోసారి శ్రీలంక కప్ గెల్చుకుంది. ఇదిలా ఉండగా కీలక మ్యాచ్ లో కొన్ని క్యాచ్ లు పరాజయం పాలు కావడానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లవెత్తుతున్నాయి. కొందరు మహిళా అభిమానులు కంట తడి పెట్టారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆసియా కప్ ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అని స్పష్టం చేశారు. పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ . ఈ విషయాన్ని సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
తాను తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు తెలిపారు. శ్రీలంక జట్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సే కు సంబంధించిన క్యాచ్ లు వదిలి వేయడం తమ కొంప ముంచిందన్నాడు షాదాబ్ ఖాన్(Shadab Khan).
ఇదే సమయంలో కెప్టెన్ దసున్ షనక్ ను ఔట్ చేసిన సంబురం అంతలోపే ఆవరై పోయిందన్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 5వ ఓవర్ లో ఓవర్ త్రోను కాపాడే ప్రయత్నంలో ఆల్ రౌండర్ స్లిప్ కావడంతో బంతి అతని తలకు తగిలింది.
మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 4 ఓవర్లు పూర్తి చేసేందుకు కోటా పూర్తి చేసేందుకు తిరిగి వచ్చాడు. ఇదే సమయంలో రాజపాక క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా షాదాబ్ ఖాన్ ,
ఆసిఫ్ అలీని ఢీకొట్టడంతో ఆ బంతి సిక్స్ గా వచ్చింది. భానుక 45 బంతుల్లో అజేయంగా 71 రన్స్ చేశాడు. 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : టీమిండియా సెలెక్షన్ పై కసరత్తు