Kanimozhi Karunanidhi : మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి – కనిమొళి

మ‌హిళగా క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నా

Kanimozhi Karunanidhi : డీఎంకే ఎంపీ క‌నిమొళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను మ‌హిళ‌గా , మ‌నిషిగా త‌మ వారి త‌ర‌పున మ‌న్నించ‌మ‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. పార్టీకి చెందిన నాయ‌కుడు ఒక‌రు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మ‌హిళా నాయకురాళ్ల‌ను తూలనాడ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా లేదా ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే ముందు మ‌నుషులుగా గుర్తించాలి. ఆ త‌ర్వాత మ‌హిళ‌ల విష‌యంలో మాట్లాడేట‌ప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు క‌నిమొళి(Kanimozhi Karunanidhi). ఇదిలా ఉండ‌గా బీజేపీకి చెందిన ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ సుంద‌ర్ చేసిన ట్వీట్ కు స్పందించారు.

డీఎంకేకు చెందిన ఒక‌రు త‌మ‌ను అన‌రాని మాట‌లు అన్నారంటూ వాపోయ‌రు. ఆమె ఇటీవ‌ల గుజ‌రాత్ లో బిల్కిస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదుకు గురైన 11 మందిని త‌మ ప్ర‌భుత్వం విడుద‌ల చేయడాన్ని త‌ప్పు ప‌ట్టారు కూడా. ఈ త‌రుణంలో ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించింది.

దీనిపై ఎంపీ క‌నిమొళి తీవ్రంగా స్పందించారు. పార్టీలు ఏవైనా స‌రే , భావ‌జాలాలు ఏమైనా ఉండ‌నీ కానీ ఇక్క‌డ ఉండాల్సింది ముఖ్య‌మైన‌ది సంస్కార‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. పార్టీ కార్య‌క‌ర్త చేసిన కామెంట్స్ ను తాను స‌మ‌ర్థించ‌డం లేద‌ని, త‌న సోద‌రుడు , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా స‌పోర్ట్ చేయ‌ర‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా సీఎం స్టాలిన్ సైతం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎవ‌రూ మ‌హిళ‌ల ప‌ట్ల చుల‌క‌న భావంతో కామెంట్స్ చేయ‌కూడ‌ద‌ని సూచించారు.

Also Read : హిందీపై త‌మిళ‌నాడులో గ‌రం గ‌రం

Leave A Reply

Your Email Id will not be published!