Mitchell Starc : అన్ని రోజులు బందీగా ఉండ‌లేను

ఇక ఆసిస్ కు అందుబాటులో ఉంటా

Mitchell Starc : ప్ర‌పంచ క్రికెట్ లో ఓ సంచ‌ల‌నం ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్. ఈ ఏడాది ఐపీఎల్ రిచ్ లీగ్ కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ వేలం పాటకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఐపీఎల్ షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది.

ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీలలో బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ వేలం పాట‌కు సిద్ద‌మైంది. ఈ త‌రుణంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

తాను ఐపీఎల్ మెగా వేలం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేశాడు. మిచెల్ స్టార్క్(Mitchell Starc) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు.

కేవ‌లం రెండు ఐపీఎల్ సీజ‌న్ లు ఆడిన మిచెల్ స్టార్క్ 27 మ్యాచ్ లు ఆడి ఏకంగా 37 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ ఆట‌గాళ్లే కాదు యువ క్రికెట‌ర్లు సైతం ఐపీఎల్ లో రావాల‌ని అనుకుంటున్న త‌రుణంలో మిచెల్ త‌ప్పుకోవ‌డంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

22 వారాల పాటు బ‌యో బ‌బుల్ లో ఉండాలంటే క‌ష్టంగా ఉంటుంద‌న్నాడు. తాను అలా ఉండ‌లేన‌ని అందుకే ఐపీఎల్ మెగా వేలం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించాడు మిచెల్ స్టార్క్.

ఇదిలా ఉండ‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ అత్యుత్త‌మ ఆటగాడి అవార్డు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మిచెల్ స్పందించాడు. నేను ఐపీఎల్ మెగా వేలానికి ద‌గ్గ‌ర‌లో ఉన్నాను.

కానీ వ్య‌క్తిగ‌తం అన్ని రోజులు బందీగా ఉండ‌లేన‌న్నాడు. ఆస్ట్రేలియా కోసం వీలైనంత ఎక్కువ‌గా ఆడాల‌ని కోరుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు స్టార్క్.

Also Read : మేమిద్ద‌రం మంచి స్నేహితులం

Leave A Reply

Your Email Id will not be published!