Sushil Kumar Pant : పంత్ ప్ర‌ముఖ క్రికెట‌ర్ అని తెలియ‌దు

రిష‌బ్ ను కాపాడిన డ్రైవ‌ర్ కామెంట్

Sushil Kumar Pant :  రూర్కీ స‌మీపంలో కారు ప్ర‌మాదానికి గురైన క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ను కాపాడిన డ్రైవ‌ర్ సుశీల్ కుమార్ (Sushil Kumar) ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ర‌హ‌దారిపై వెళుతున్న స‌మ‌యంలో పంత్ కాకున్నా లేక ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రున్నా తాను స్పందించి, సాయం చేసే వాడినంటూ పేర్కొన్నారు సుశీల్ కుమార్.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పంత్ ను ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి ఈ డ్రైవ‌ర్ పై.

ఇదిలా ఉండ‌గా డ్రైవ‌ర్ తో పాటు కండ‌క్ట‌ర్ ను కూడా స‌న్మానించారు. ఢిల్లీ నుంచి రూర్కీకి రిష‌బ్ పంత్ స్వంతంగా కారు న‌డుపుకుంటూ వెళ్లాడు. రూర్కీ స‌మీపంలో అదుపు త‌ప్పి కారు డివైడ‌ర్ ను ఢీకొట్టింది.

దీంతో అటు వైపు వెళుతున్న హ‌ర్యానా రోడ్ వేస్ కు చెందిన సుశీల్ కుమార్ వెంట‌నే ప్ర‌మాదానికి గురైన కారును చూశాడు. అందులో అచేన‌తంగా ప‌డి ఉన్న రిష‌బ్ పంత్ ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడు. ఆపై త‌న వ‌ద్ద ఉన్న దుప్ప‌టిని అత‌డిపై క‌ప్పాడు. కండ‌క్ట‌ర్ అంబులెన్స్ కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో రిష‌బ్ పంత్ ను వెంటనే రూర్కీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి డెహ్రాడూన్ ప్ర‌ధాన ఆస్ప‌త్రిలో చేర్చారు. దీంతో ప్రాణా పాయం నుండి బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు రిష‌బ్ పంత్. రిష‌బ్ పంత్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. కేవ‌లం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో మాత్ర‌మే త‌న‌ను ర‌క్షించాన‌ని చెప్పాడు. బ‌స్ కండ‌క్ట‌ర్ ప‌ర‌మ‌జీత్ స‌హాయంతో రిష‌బ్ పంత్ ను బ‌య‌ట‌కు తీశామ‌న్నాడు సుశీల్ కుమార్(Sushil Kumar).

Also Read : భార‌త్ లో ఆడ‌టం అద‌న‌పు బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!