Assam CM : జిగ్నేష్ మేవానీ ఎవ‌రో తెలియ‌దు – సీఎం

ఎమ్మెల్యే అరెస్ట్ పై బిస్వా శ‌ర్మ కామెంట్

Assam CM : అభ్యంత‌ర‌క‌ర ట్వీట్లు చేశాడంటూ గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ.

కోక్రాఝ‌ర్ లో నేర పూరిత కుట్ర‌తో స‌హా వివిధ ఆరోప‌ణ‌ల‌పై ఎఫ్ఐఆర్ దాఖ‌లు చేశారు ద‌ళిత నాయ‌కుడిగా పేరొందిన ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై. ఆయ‌న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై అభ్యంత‌క‌ర‌మైన ట్వీట్లు చేశారు.

దీనికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ గౌహ‌తికి తీసుకు వ‌చ్చారు మేవానీని. ఈ సంద‌ర్భంగా అస్సాం సీఎం హిమంత బిస్వ శ‌ర్మ(Assam CM) స్పందించారు ఎమ్మెల్యే అరెస్ట్ పై. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న తాపీగా స‌మాధానం ఇచ్చారు.

జిగ్నేష్ మేవానీ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఒక ర‌కంగా ఎద్దేవా చేశారు. ఆయ‌న గురించి త‌న వ‌ద్ద స‌మాచారం లేద‌న్నారు. దేశం గుర్తించ ద‌గిన లేదా గుర్తు పెట్టుకోగ‌లిగిన వ్య‌క్తి కాదు క‌దా అంటూ నిల‌దీశారు సీఎం.

జిగ్నేష్ మేవానీ ఎవ‌రో తెలియ‌న‌ప్పుడు త‌న‌పై ప్ర‌తీకార రాజ‌కీయాలు తాను ఎందుకు చేస్తానంటూ ప్ర‌శ్నించారు హిమంత బిస్వ శ‌ర్మ‌. ఆయ‌న‌ను ర‌క్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నించ‌డం దారుణ‌మ‌న్నారు.

మేవానీ అరెస్ట్ లో కుట్ర జ‌రిగిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. మేవానీ ప్ర‌ధానంగా మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అనుబంధ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా మేవానీని బెయిల్ పై విడుద‌ల చేయ‌కుంటే అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలియ చేస్తామ‌ని కాంగ్రెస్ నేత మంజిత్ మ‌హంత హెచ్చ‌రించారు.

Also Read : కూల్చివేత‌ల‌పై కాంగ్రెస్ క‌న్నెర్ర

Leave A Reply

Your Email Id will not be published!