Priyanka Gandhi : ఆ ఇద్ద‌రి నుంచి ఎంతో నేర్చుకున్నా

ఇందిర‌..సోనియాపై ప్రియాంక కామెంట్స్

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త దేశ ప్ర‌ధాన మంత్రి, త‌న నాయన‌మ్మ ఇందిరా గాంధీ నుంచి ధైర్యాన్ని త‌న త‌ల్లి సోనియా గాంధీ ప‌ట్టుద‌ల నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని అన్నారు యువ నాయ‌కురాలు. సోమ‌వారం క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ప్ర‌సంగించారు. మ‌హిళా కేంద్రీకృత స‌ద‌స్సులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌న‌లో స్పూర్తి నింపారని చెప్పారు. మ‌హిళ‌లు త‌లుచుకుంటే సాధించ లేనిది ఏమీ లేద‌ని అన్నారు. ఇటీవ‌ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీజేపీని ప్ర‌జ‌లు గ‌ద్దె దించారని, కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టార‌ని అన్నారు.

తాము అక్క‌డ కూడా పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో త‌మ ప్ర‌భుత్వం గ‌నుక వ‌స్తే వెంట‌నే గృహ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా ప్ర‌తి మ‌హిళా కుటుంబానికి నెల‌కు రూ. 2 వేల రూపాయ‌ల సాయం చేస్తామ‌ని వెల్ల‌డించారు ప్రియాంక గాంధీ.

తాను ఇద్ద‌రి ధైర్య‌వంతులైన మ‌హిళ‌ల చేతుల్లో పెరిగాన‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేద‌లు, సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తుంద‌ని అన్నారు. కులం, మ‌తం , ప్రాంతాల పేరుతో విఛ్చన్నం చేసే రాజ‌కీయాల‌ను తాము ఏనాడూ ప్రోత్స‌హించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్రియాంక గాంధీ.

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ఉండ‌నుంది.

Also Read : దేశ ర‌క్ష‌ణ‌లో అగ్నీ వీర్ ల పాత్ర కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!