Sourav Ganguly : నేను కోహ్లీ కంటే గొప్పగా ఆడాను – గంగూలీ
సెంచరీతో ఫామ్ లోకి రావడం గ్రేట్
Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను విరాట్ కోహ్లీతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. తాను కోహ్లీ కంటే గొప్పగా ఆడానంటూ స్పష్టం చేశాడు.
అతడి కంటే ఎక్కువగా , గొప్పగా ఆడానని పేర్కొన్నాడు. శనివారం సీరియస్ గా స్పందించాడు. కాగా క్రికెట్ లో ఒక క్రికెటర్ ను ఇంకో క్రికెటర్ తో పోల్చ కూడదని సూచించాడు.
ఎవరి ఆట వారిదేనని పేర్కొన్నాడు. 33 ఏళ్ల తన కెరీర్ లో ఎన్నో మలుపులు, మజిలీలులు ఉన్నాయని గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా ఆఫ్గనిస్తాన్ తో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీని(Virat Kohli) ఈ సందర్భంగా ప్రశంసించాడు.
స్టార్ బ్యాటర్ చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. కోల్పోయిన ఫామ్ ను తిరిగి తెచ్చు కోవడం మంచిదన్నారు. 2019 తర్వాత అంటే మూడేళ్ల గ్యాప్ తర్వాత సెంచరీ చేశాడు.
పొట్టి ఫార్మాట్ టి20లో తన మొదటి సెంచరీ సాధించాడు. ఇప్పటికే కోహ్లీ మూడు ఫార్మాట్ లలో అత్యధిక పరుగులు చేసి సత్తా చాటాడు. కానీ గత కొంత కాలంగా ఫోర్లు, సిక్సర్లు కొట్టేందుకు నానా తంటాలు పడ్డాడు.
ఒకానొక దశలో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో తాజా, మాజీ ఆటగాళ్లు కోహ్లీపై విమర్శల వర్షం కురిపించారు. మొత్తంగా కోహ్లీ రాణించడం భారత జట్టుకు మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.
కాగా దాదా చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Also Read : లంకేయుల ఆట తీరుకు ఫిదా