Yashwant Jadhav : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాక్ ఇచ్చింది. శివసేనకు కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే బావమరిది ఆస్తులను జప్తు చేసింది.
ఆ తర్వాత ఇద్దరు మంత్రులకు ఝలక్ ఇచ్చింది. ఇటీవల మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేసింది. అంతకు ముందు మరో మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
తాజాగా శివసేనకు చెందిన పన్ను ఎగవేతకు సంబంధించి కీలక మార్పు జరిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ – బీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ యశ్వంత్ జాదవ్ (Yashwant Jadhav ) కు చెందిన రూ. 5 కోట్ల విలువైన ప్లాట్ తో సహా 41 ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసింది.
ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. అటాచ్ చేసిన ఆస్తులలో బైకుల్లా లోని బిల్దాదీ చాంబర్ బిల్డింగ్ లోని 31 ప్లాట్లు, బాంద్రా లోని రూ. 5 కోట్ల విలువైన ప్లాట్, బైకు ల్లాలోని హోటల్ క్రౌన్ ఇంపీరియల్ ఉన్నాయి.
యశ్వంత్ జాదవ్ బీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
అటాచ్ చేసిన ఆస్తులు యశ్వంత్ జాదవ్(Yashwant Jadhav ), ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరుతో రిజిస్టర్ అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
ఒక హోటల్ కు శివసేన ఎమ్మెల్యే , యశ్వంత్ జాదవ్ భార్య యామినీ జాదవ తల్లి సునంద మోహితే పేరు పెట్టారని తెలిపింది. విలాస్ మోహితే యశ్వంత్ జాదవ్ బీఎంసీ పనిని పర్యవేక్షిస్తుండగా వినీత్ జాదవ్ బిమల్ అగర్వాల్ న్యూష్వక్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా ఉన్నారని ఐటీ పేర్కొంది.
Also Read : గవర్నర్ ధన్ కర్ తో సీఎం దీదీ భేటీ