IT Raided : దేశంలోని ఐదు రాష్ట్రాలలో రూ. 6 వేల కోట్లు కలిగిన యూనికార్న్ స్టార్టప్ కంపెనీపై దాడులు చేపట్టినట్లు ఐటీ శాఖ(IT Raided )ఇవాళ వెల్లడించింది.
కంపెనీకి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ లోని 23 ప్రాంతాల్లో ఈనెల 9న సోదాలు జరిగాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది.
మహారాష్ట్రంలోని పుణె, థానే కేంద్రంగా యూనికార్న్ స్టార్టప్ కంపెనీ పని చేస్తోంది. రూ. 224 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించిందని సీబీడీటీ వెల్లడించింది.
యూనికార్న్ కంపెనీ గ్రూపు నిర్మాణ సామాగ్రి, టోకు, రిటైల్ రంగాలలో నిమగ్నమై ఉందని తెలిపింది. సదరు కంపెనీ వార్షిక ఆదాయం రూ. 6 వేల కోట్లకు పైగానే ఉందని జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ , పన్ను శాఖ పాలసీ మేకింగ్ బాడీ ఈ మేరకు గుర్తించిందని తెలిపింది. ఇప్పటి వరకు కోటి రూపాయల నగదు, 22 లక్షల రూపాయల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
ఈ కంపెనీ గ్రూపు బోగస్ కొనుగోళ్లను బుక్ చేసిందని, భారీఈ ఎత్తున లెక్కలు చూపకుండగా నగదు ఖర్చు చేసినట్లు బిల్లులు తయారు చేసిందని ఆరోపించింది. రూ. 400 కోట్లకు పైగా ఉన్నట్లు తేలిందని స్పష్టం చేసింది.
ఎక్కువ అదనపు ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు గ్రూప్ డైరెక్టర్లు అంగీకరించినట్లు పేర్కొంది ఐటీ. అధిక ప్రీమియంతో షేర్లను జారీ చేయడం ద్వారా యూనికార్న్ గ్రూప్ (IT Raided )మారిషస్ మార్గం ద్వారా భారీ విదేశీ నిధులను పొందినట్లు తెలిపింది.
షెల్ కంపెనీల హవాలా నెట్ వర్క్ కూడా బయట పడిందని వెల్లడించింది.
Also Read : మనీ కంటే వ్యక్తిగత సంతృప్తి గొప్పది