Swati Maliwal : లైంగిక వేధింపులకు గురయ్యా – మలివాల్
ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్
Swati Maliwal Sexually assaulted : ఇటీవల భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ తను చిన్ననాడు ఎలా తండ్రితో లైంగిక వేధింపులకు గురయ్యానే విషయాన్ని పంచుకుంది. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న తనంలో కూడా తాను కూడా తన తండ్రితో లైంగిక పరంగా చిత్రహింసలకు గురైనట్లు వాపోయారు.
బడిలో నాల్గవ తరగతి చదివే దాకా తన తండ్రితో కలిసి జీవించానని , ఇలాంటి వేధింపులు చాలాసార్లు తాను ఎదుర్కొన్నానని వాపోయారు స్వాతి మలివాల్. ఇంటికి వస్తున్నాడంటే చాలు భయంతో వణికి పోయే దానినని గుర్తు చేసుకున్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా స్వంత తండ్రి నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వాపోయారు. చాలా సార్లు కొట్టాడు. భయంతో తట్టుకోలేక మంచం కిందకు వెళ్లేదానిని చెప్పారు.
ఇలాంటి లైంగిక వేధింపులు, దాడులు చాలా సార్లు దేశంలోని ఎందరో మహిళలు ఎదుర్కొన్నారని కానీ బయటకు చెప్పుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు ఢిల్లీ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal Sexually assaulted). తన తండ్రి పోనీటెయిల్ తో కొట్టాడు. ఒకసారి గోడకేసి బాదాడు. దీంతో రక్తం వచ్చిందని తెలిపింది.
ఇక నటి ఖుష్బు సుందర్ తాను 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన తండ్రి లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వాపోయింది. ప్రస్తుతం ఖుష్బు సుందర్, స్వాతి మలివాల్ లు హాట్ టాపిక్ గా మారారు.
Also Read : బండిపై మహిళా కమిషన్ సీరియస్