India Suspends : ముదిరిన వివాదం వీసాల‌పై ప్ర‌భావం

చైనాకు షాక్ ఇచ్చిన భార‌త దేశం

India Suspends  : రోజు రోజుకు వివాదం ముదురుతోంది. అది టూరిస్టుల‌పై ప‌డుతోంది. తాజాగా భార‌త్ , చైనా దేశాల మ‌ధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ల‌ఢ‌క్ స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా ఒప్పందాన్ని మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తోంది.

భార‌త్ ప‌దే పదే అభ్యంత‌రం చెబుతోంది. అయినా చైనా మార‌డం లేదు. మార్చుకోవ‌డం లేదు. సై అంటే సై అంటోంది. క‌య్యానికి కాలు దువ్వుతోంది. దీనిని ప్ర‌తిసారి త‌ప్పు ప‌డుతూ వ‌స్తోంది.

తాజాగా చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ దేశ జాతీయుల‌కు జారీ చేసిన టూరిస్ట్ వీసాల‌ను స‌స్పెండ్ (India Suspends )చేసింది. ఈ విష‌యాన్ని గ్లోబ‌ల్ ఎయిర్ లైన్డ్ బాడీ ఐఏటీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేష‌న్ కు వెల్ల‌డించింది.

అయితే ఆ దేశంలోని యూనివ‌ర్శిటీల్లో చ‌దువుతున్న 22 వేల మంది విద్యార్థులు క‌రోనా కార‌ణంగా స్వ‌దేశానికి చేరుకున్నారు. మ‌ళ్లీ చైనాకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు.

వారి రాక‌ను చైనా తిర‌స్క‌రించింది. పాకిస్తాన్, శ్రీ‌లంక‌, థాయ్ లాండ్ నుంచి స్టూడెంట్స్ కు చైనా ఓకే చెప్పింది. ఇదిలా ఉండ‌గా భార‌త్ లో ప‌ర్య‌టించిన వాంగ్ యితో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు విదేశాంగ మంత్రి జై శంక‌ర్.

ఈరోజు వ‌ర‌కు దానిపై స్పందించ లేదు చైనా. భూటాన్ , మాల్దీవులు, నేపాల్ జాతీయుల‌కు వెసులుబాటు ఇచ్చిన‌ట్లు తెలిపింది. కాగా భార‌త దేశ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఇంకా చైనా స్పందించ లేదు.

రోజు రోజుకు ఆయా దేశాల మ‌ధ్య వివాదాలు మ‌రింత ముదురుతున్నాయి.

Also Read : జ‌మ్మూ- కాశ్మీర్ కు 38 వేల కోట్లు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!