Ibobi Singh : మణిపూర్ లో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించడమే కాదు బీజేపీకి కంటి మీద నిద్ర లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఒక్రామ్ ఇబోబి సింగ్(Ibobi Singh).
సీఎంగా ఉగ్రవాదాన్ని అణగ దొక్కడంలో సక్సెస్ అయ్యాడు. విజయం వచ్చినా పరాజయం దక్కినా కూల్ గానే ఉన్నారు.
రాష్ట్రాన్ని నిత్యం అతలాకుతలం చేసిన 30కి పైగా మిలిటెంట్ గ్రూపులకు చుక్కలు చూపించాడు.
అంతేనా తనపై ఎన్ని దాడులకు పాల్పడినా తప్పించుకుని ఒంటరిగా నిలబడ్డాడు.
ఒకరకంగా చెప్పాలంటే మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ కంటే ఇబోబి అంటేనే ఎక్కువగా గుర్తు పడతారు ఆ రాష్ట్ర ప్రజలు.
బలమైన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఆయనకు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికలు సవాల్ గా మారాయి.
ఊహించని రీతిలో బీజేపీ పవర్ లోకి రావడం, తనకు చెందిన వారిని జంపింగ్ కాకుండా అడ్డు కోవడంలో ఫెయిల్ అయ్యారు.
ఇది ఒక రకంగా ఆయనకు ఊహించని దెబ్బ. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎందరినో ఢీకొన్న ఈ ధీశాలికి ఇప్పుడు కొన్ని ఘటనలు ఇబ్బందిగా మారాయి.
ప్రస్తుతం ఒక్క మణిపూర్ కే కాదు ఈశాన్య రాష్ట్రాలకు ఆయనే పెద్ద దిక్కుగా మారారంటే నమ్మలేం. ఆయనను అందరూ ఇబోబి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
1981లో కోఆపరేటివ్ సొసైటీకి కార్యదర్శిగా ఇబోబి సింగ్(Ibobi Singh) పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. 1984లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1995, 2000లో ఓడి పోయారు. 1999లో పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. 2002లో తక్కువ స్థానాలు వచ్చినా కూటమితో కలిసి సీఎంగా ఉన్నారు. ఆనాటి నుంచి 2017 దాకా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇది ఓ రికార్డు మణిపూర్ రాష్ట్ర చరిత్ర పరంగా చూస్తే. తీవ్రవాదాన్ని అణిచి వేయడంలో సక్సెస్ అయ్యారు. 2017లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కు వచ్చినా పవర్ లోకి రాలేక పోవడం విశేషం. వలసల్ని నివారించడంలో ఫెయిల్ అయ్యాడు.
Also Read : పంజాబ్ లో టార్చ్ బేరర్ ఎవరో