AUS vs IND WTC Final 2023 : గెలిస్తే భారీ ప్రైజ్ మనీ
వెల్లడించిన ఐసీసీ
AUS vs IND WTC Final 2023 : ఐపీఎల్ ఆఖరి దశకు చేరుకుంది. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ . ఇందు కోసం క్రీడా లోకం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. భారత్(India) , ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్ లోని ఓవెల్ లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఐంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇందు కోసం ఏకంగా రూ. 29.75 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది ఐసీసీ.
ఈ ఫైనల్ పోరులో గెలిచిన జట్టుకు భారీ క్యాష్ దక్కనుంది. టెస్టు ఛాంపియన్ గా నిలిచిన టీమ్ కు రూ. 13.22 కోట్లు లభిస్తాయి. రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు రూ. 6.61 కోట్లు , మూడో ప్లేస్ లో నిలిచిన సౌతాఫ్రికాకు రూ. 3.71 కోట్లు లభించనున్నాయి.
ఇక పాయింట్ల పట్టికలో నిలిచిన ప్రతి జట్టుకు ప్రయోజనకరంగా ఉండేలా ఐసీసీ ప్లాన్ చేసింది. ఇక 4వ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ. 2.89 కోట్ల బహుమతి దక్కనుంది. 5వ ర్యాంక్ లో ఉన్న శ్రీలంక జట్టు రూ. 1.65 కోట్లు అందుకోనుంది. ఇక మిగతా స్థానాలలో నిలిచిన జట్లకు రూ. 84 లక్షలు దక్కనున్నాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, విండీస్ , బంగ్లాదేశ్ లు వరుస సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికే భారత కోచ్ తో సహా ఇతర సిబ్బంది ఇంగ్లండ్ కు చేరుకున్నారు. ఐపీఎల్ ముగిశాక టీం బయలు దేరుతుంది.
Also Read : TSRTC Snack Box
