ICC WC 2022 TEAM : ఐసీసీ నిర్వాకం అభిమానుల ఆగ్ర‌హం

మ‌హిళ‌ల అత్యుత్త‌మ జ‌ట్టులో భార‌త్ కు నో ఛాన్స్

ICC WC 2022  : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసింది. న్యూజిలాండ్ వేదిక‌గా జ‌రిగిన ఈ రిచ్ లీగ్ టైటిల్ ను ఆస్ట్రేలియా మహిళా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. వ‌రుస‌గా ఏడోసారి క‌ప్ ను గెల‌వ‌డం.

ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు సెమీస్ కు రాకుండానే ఇండియా కు వ‌చ్చేసింది. అద్భుత‌మైన పోరాట పటిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ త‌రుణంలో ఐసీసీ మ‌హిళ‌ల అత్యుత్త‌మ వ‌ర‌ల్డ్ టీమ్(ICC WC 2022 )ను ప్ర‌క‌టించింది.

విచిత్రం ఏమిటంటే మ‌హిళా భార‌త క్రికెట్ జ‌ట్టు అద్భుత‌మైన క్రీడాకారులు ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌రిని కూడా ఎంపిక చేయ‌లేదు ఐసీసీ . దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌క‌టించిన జ‌ట్టుకు ఆసిస్ మెగ్ లానింగ్ కెప్టెన్ గా ఎంపిక చేసింది ఐసీసీ. ఈ టోర్నీలో ఆమె 394 ర‌న్స్ తో ఆక‌ట్టుకుంది. ఇక హీలీ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎంపికైంది.

వీరితో పాటు రాచెల్ హేన్స్ , బెత్ మూనీకి చోటు ద‌క్కింది. ఇదిలా ఉండ‌గా జ‌ట్టు ప‌రంగా చూస్తే హీలీ వికెట్ కీప‌ర్ గా ఎంపిక చేసింది.

లానింగ్ స్కిప్ప‌ర్ కాగా హేన్స్ ఉండ‌గా ఇంగ్లండ్ కు చెందిన నాట్ స్కివ‌ర్ , ఆసిస్ కు చెందిన బెత్ మూనీ, విండీస్ కు చెందిన హేలీ మాథ్యూస్ , ద‌క్షిణాఫ్రికాకు చెందిన మారిజానే కాప్ ను ఎంపిక చేసింది.

ఇంగ్లండ్ కు చ‌చెందిన సోఫీ ఎక్లెస్టోన్ , ద‌క్షిణాఫ్రికాకు (ICC WC 2022 )చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ , బంగ్లా దేశ్ కు చెందిన స‌ల్మా ఖాతూన్ , ఇంగ్లండ్ కు చెందిన చార్లీ డీన్ ఉన్నారు.

Also Read : ధోనీ ఆట తీరుపై స‌న్నీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!