ICC Fine : ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లలో విజయ ఢంకా మోగించిన ఇంగ్లండ్ పటిష్టమైన భారత జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది.
ఏకంగా రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. జానీ బెయిర్ స్టో, జో రూట్ దెబ్బకు భారత బౌలర్లు బెంబేలెత్తి పోయారు. ప్రధానంగా ఛాలెంజ్ చేసి మరీ సెంచరీలు బాదాడు స్టో.
మొదటి ఇన్నింగ్స్ లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడితే రెండో ఇన్నింగ్స్ లో సెన్సేషన్ శతకంతో మెరిశాడు. ఒక్క బుమ్రా మినహా ఏ ఒక్క బౌలర్ ప్రభావం చూపలేక పోయారు.
ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించారు. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు.
బ్యాటింగ్ పరంగా రాణించక పోవడం వల్లనే తాము ఓడి పోయామని చెప్పాడు. ఇదిలా ఉండగా పరాజయంతో కుంగి పోయిన టీమిండియాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)(ICC Fine) .
చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్ పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో సైతం 2 పాయింట్లు కోత విధించింది.
దీంతో భారత జట్టు నాలుగో స్థానానికి పడి పోయింది. ఇదిలా ఉండగా ఈ ఓటమితో పటౌడి ట్రోఫీ 2-2 తో డ్రాగా ముగించింది.
Also Read : ఇంగ్లండ్ అద్భుతం భారత్ ఓటమిపై ఆగ్రహం