ICC Cricketer Of The Year : ఐసీసీ అవార్డు రేసులో ఆ నలుగురు
భారత్ నుంచి సూర్య కుమార్ యాదవ్
ICC Cricketer Of The Year : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి ఏటా టీ20 ఫార్మాట్ లో బ్యాటర్ , బౌలర్, ఆల్ రౌండర్ లను ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా 2022వ సంవత్సరానికి గాను నలుగురు ప్లేయర్లను(ICC Cricketer Of The Year) ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ఈ అవార్డు రేసులో భారత్ నుంచి సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కింది.
ఇక సూర్య భాయ్ తో పాటు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ , జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా తో పాటు పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్ కూడా ఉన్నారు.
ఈ నలుగురు ప్లేయర్లు తమ తమ జట్ల విజయాలలో తమదైన ముద్ర కనపర్చారు. ఈ ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు సూర్య కుమార్ యాదవ్. మనోడి ఆట తీరు అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరూ చెప్పలేరు. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే.
డిఫరెంట్ గా ఆడడాన్ని ఎక్కువగా ఇష్ట పడతాడు. సంప్రదాయ ఆటకంటే భిన్నంగా ఆడడమే తనకు ఇష్టమని పలుమార్లు చెప్పాడు కూడా. ఇక ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో ఏకంగా 187.43 స్ట్రైక్ రేట్ తో 1,164 రన్స్ చేశాడు. ఏకంగా మనోడు 68 సిక్సర్లు బాదాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఉన్నాడు. కీవీస్ టూర్ లో సెంచరీ చేశాడు. సామ్ కరన్ , రిజ్వాన్ , సికిందర్ రజా కూడా రేసులో ఉన్నా సూర్య కే ఛాన్స్ దక్కనుందని టాక్.
Also Read : ధావన్ భవితవ్యం ప్రశ్నార్థకం