ICC ODI Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ ఇవాళ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. మరోసారి తన ర్యాంకు నిలుపుకున్నాడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబార్ ఆజమ్.
ఇక రెండు పాయింట్లు మెరుగు పర్చుకున్న భారత జట్టు (ICC ODI Rankings)స్కిప్పర్ రోహిత్ శర్మ మూడో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పటి లాగే తన ప్లేస్ ను కోల్పోలేదు.
రోహిత్ 807 పాయింట్లు సాధిస్తే బాబర్ ఆజమ్ 873 పాయింట్లు సాధించడం విశేషం. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ , పాకిస్తాన్ ఓపెనర్ బ్యాటర్ జమాన్ టాప్ 10 లోకి చేరారు.
741 ఫఖర్ సాధించి 9వ స్థానం దక్కించు కోగా జో రూట్ 740 పాయింట్లతో పదో స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో జో రూట్ స్కిప్పర్ గా ఉన్నప్పటికీ బాగా ఆడినా తన జట్టును గెలిపించ లేక పోయాడు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే గతంలో ప్రకటించిన ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్(ICC ODI Rankings) హోల్డర్ తన ఆట తీరుతో ర్యాంకును మెరుగు పర్చుకున్నాడు.
టీమిండియాతో ప్రస్తుతం వెస్టిండీస్ సీరీస్ లో భాగంగా ఆడుతున్నాడు. కాగా ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ -2లో భాగంగా యూఏఈ సీరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన ఒమన్ కు చెందిన జంతీందర్ సింగ్ 26 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 100 లోకి ప్రవేశించాడు.
అయితే జతీందర్ సింగ్ 23 మ్యాచ్ లలో 594 పరుగులతో లీగ్ 2లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
Also Read : పీసీబీ ప్రతిపాదన బీసీసీఐ తిరస్కరణ