ICC Player Of The Month : కోహ్లీ..జెమిమా..దీప్తి శ‌ర్మ నామినేట్

దీప్తి శ‌ర్మ కూడా నామినేట్

ICC Player Of The Month : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు మ‌హిళా క్రికెట‌ర్లు జెమిమా రోడ్రిగ్స్ , దీప్తి శ‌ర్మ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ కి నామినేట్(ICC Player Of The Month) అయ్యారు. ఈ విష‌యాన్ని ఐసీసీ గురువారం అధికారికంగా ప్ర‌క‌టించింది. పురుషుల‌, మ‌హిళ‌ల విభాగంలో వీరు నామినేట్ అయిన‌ట్లు తెలిపింది.

ఆసియా క‌ప్ విజేత ద్వ‌యం జెమిమా రోడ్రిగ్స్ , దీప్తి శ‌ర్మ‌తో పాటు బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. నామినేష‌న్లు అక్టోబ‌ర్ నెల‌లో ఉంటాయి. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ , నెద‌ర్లాండ్స్ పై టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు మొద‌టిసారిగా కోహ్లీ నామినేట్ అయ్యాడు.

జెమీమా రోడ్రిగ్స్ , దీప్తి శ‌ర్మ‌లు భార‌త మ‌హిళా జ‌ట్టు త‌ర‌పున ఆసియా క‌ప్ గెలుచు కోవడంలో కీల‌క పాత్ర పోషించారు. ఇక మ‌హిళ‌ల ఆసియా క‌ప్ లో జెమిమా రోడ్రిగ్స్ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల స్కోర‌ర్ గా నిలిచారు. దీప్తి శర్మ ప్లేయ‌ర్ ఆది టోర్న‌మెంట్ గా, ఉమ్మ‌డి లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఎంపిక‌య్యారు.

ఇక విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. అక్టోబ‌ర్ నెల‌లో మొత్తం 205 ప‌రుగులు చేశాడు. పాకిస్తాన్ పై 82, నెద‌ర్లాండ్స్ పై 62 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. పాకిస్తాన్ తో చ‌రిత్రాత్మ‌క‌మైన విజ‌యం సాధించ‌డంలో కీల‌క భూమిక పోషించాడు విరాట్ కోహ్లీ.

ఇక కోహ్లీతో పాటు సౌతాఫ్రికాకు చెందిన మిల్ల‌ర్, జింబాబ్వేకు చెందిన సికింద‌ర్ ర‌జా కూడా నామినేట్ అయ్యారు. మ‌రో వైపు జెమీమా 8 మ్యాచ్ ల‌లో 217 ప‌రుగులు చేసింది.

Also Read : కోహ్లీపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!