ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ డిక్లేర్

స‌త్తా చాటిన బాబ‌ర్..భార‌త బౌల‌ర్లు

ICC Test Rankings : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)  బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల‌లో ప్ర‌క‌టించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ రెండో స్థానంలో నిలిచాడు. లబూషేన్ టాప్ లో నెంబ‌ర్ వ‌న్ లో ఉన్నాడు. ఇక బౌల‌ర్ల విభాగంలో కుల్దీప్ యాద‌వ్ , అక్ష‌ర్ ప‌టేల్ ర్యాంకింగ్స్ లో దూసుకు పోయారు.

క‌రాచీలో ఇంగ్లండ్ తో జ‌రిగిన ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ సీరీస్ లోని చివ‌రి టెస్టులో బాబ‌ర్ రెండు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఇందులో 78, 54 ర‌న్స్ ఉన్నాయి. అయితే బాబ‌ర్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ‌ట్టు ఘోరంగా ఓట‌మి పాలైంది. ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయ్యింది.

మూడు టెస్టుల్లోను ఓట‌మి పాలై 3-0 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయింది. ఇక వ‌న్డే, టి20 ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు బాబ‌ర్ ఆజ‌మ్. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో లాబుషేన్ కంటే ఇంకా 61 పాయింట్ల దూరంలో ఉన్నాడు.

ఇక ఆసిస్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ బ్రిస్బేన్ లో అత్య‌ధికంగా 92 ర‌న్స్ చేశాడు. దీంతో 800 రేటింగ్ పాయింట్ల‌తో నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక బంగ్లా టూర్ లో అద్భుతంగా ఆడాడు ఛ‌తేశ్వ‌ర్ పుజారా.

90, 102 ర‌న్స్ చేశాడు. 16వ స్థానానికి చేరుకున్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ 11వ ప్లేస్ లో ఉన్నాడు. శుభ్ మ‌న్ గిల్ 54 ర్యాంక్ సాధించాడు. ఇంగ్లంగ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 23వ ర్యాంకు కాగా టెంబా బావుమా 24వ ర్యాంక్ సాధించాడు. ష‌కీబ్ అల్ హ‌స‌న్ 37వ ర్యాంకుల‌, హ్యారీ బ్రూక్ 50 ర్యాంకులో నిలిచాడు.

Also Read : 227 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్

Leave A Reply

Your Email Id will not be published!