ICC Top 10 Babar Azam : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబర్ టాప్
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
ICC Top 10 Babar Azam : పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ లో గత ఏడాది 2022లో అత్యధిక పరుగుల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఇందులో భాగంగా పాక్ స్కిప్పర్ బాబప్ ఆజమ్ టాప్ లో నిలిచాడు.
మొత్తం 10 మంది ఆటగాళ్లను ప్రకటించింది ఐసీసీ. విచిత్రం ఇవాళ విడుదల చేసిన లిస్టులో ఒక్క భారత దేశానికి చెందిన క్రికెటర్ కు చోటు దక్కక పోవడం విశేషం. 1184 పరుగులతో బాబర్ ఆజమ్(ICC Top 10 Babar Azam) నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో 1098 రన్స్ తో ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ ఉన్నాడు.
ఇక 1080 పరుగులతో ఉస్మాన్ ఖ్వాజా మూడో ప్లేస్ దక్కించుకున్నాడు. నాలుగో స్థానంలో 1068 పరుగులతో జానీ బెయిర్ స్టో నిలిచాడు. 957 రన్స్ తో లబూషేన్ అయిదవ ప్లేస్ లో నిలిచి విస్తు పోయేలా చేశాడు. ఆరవ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాటర్ స్టివ్ స్మిత్ 876 పరుగులతో నిలిచాడు.
ఇక ఏడవ స్థానంలో 870 రన్స్ తో నిలిచాడు బెన్ స్టోక్. 844 రన్స్ తో ఎనిమిదో వ దక్కించుకున్నాడు జాక్ క్రావ్లే . తొమ్మది ప్లేస్ లో పాకిస్తాన్ కు చెందిన యంగ్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ నిలిచాడు. ఈ క్రికెటర్ కేవలం 3 పరుగుల తేడాతో 9వ స్థానం కోల్పోయాడు. కేవలం 837 రన్స్ మాత్రమే చేశాడు. ఇక 10వ స్థానంలో 823 రన్స్ తో అబ్దుల్లా షఫక్ నిలిచాడు.
Also Read : బీసీసీఐ 2023 షెడ్యూల్ రిలీజ్