ICC Womens T20 World Cup : టీ20 వరల్డ్ కప్ కు వేళాయె
వరుసగా ఎనిమిదో ఎడిషన్
ICC Womens T20 World Cup : భారత దేశంలో క్రికెట్ కు ఉన్నంత ఆదరణ ఇంకే ఏ ఆటకు లేదు. పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ కూడా ఆదరణ లభిస్తోంది. కొత్త సంవత్సరంలో పుష్ జోష్ లో ఉంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఎందుకంటే ఉమెన్ ఐపీఎల్ వేలం పాటలో భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. షఫాలీ వర్మ సారథ్యంలోని అమ్మాయిలు అదుర్స్ అనిపించారు.
ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి తమకు ఎదురే లేదని చాటారు. ఇక తాజాగా రేపటి నుంచి ఫిబ్రవరి 10 నుంచి మరో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ కు(ICC Womens T20 World Cup) వేళ అయ్యింది. ఇప్పటికే భారత మహిళా జట్టు 2009, 2010, 2018లో మూడుసార్లు సెమీ ఫైనల్ కు చేరుకుంంది. మరో మూడుసార్లు 2012, 2014, 2016 లో తొలి రౌండ్ కు చేరింది. 2020లో రన్నరప్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఏడుసార్లు టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది.
ప్రస్తుతం జరగబోయేది ఎనిమిదో ఎడిషన్ . దక్షిణాఫ్రికా వేదికగా మెగా టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. ఈసారైనా భారత జట్టు మరింత సత్తా చాటుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక అండర్ 19లో సత్తా చాటిన రిచా ఘోష్ , షెఫాలీ వర్మ మెయిన్ జట్టులో చేరనున్నారు. మరో వైపు స్టార్ హిట్టర్ గా పేరొందిన స్మృతీ మంధాన సైతం ఈసారి సత్తా చాటాలని చూస్తోంది.
ఓపెనింగ్ లో స్మృతీ మంధాన, షెఫాలీ గనుక రాణిస్తే తిరుగుండదు జట్టుకు. ఇక మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , జెమీమా, హర్లీన్ , దీప్తి శర్మ ఉండనే ఉన్నారు. బౌలింగ్ లో పర్వాలేదు. కానీ ఫీల్డింగ్ లో ఒక్కటే కొంచెం ఇబ్బంది పడుతోంది. టోర్నీలో ఇండియాతో పాటు ఇంగ్లండ్ , పాకిస్తాన్ , విండీస్ , ఐర్లాండ్ ఉన్నాయి.
Also Read : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా