ICC World Cup Final : అహ్మ‌దాబాద్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ వెల్ల‌డి

ICC World Cup Final : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ప్ర‌స్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందిగ్దంలో ఉంది. ఇప్ప‌టికే పీసీబీ చీఫ్ , చైర్మ‌న్ న‌జామ్ సేథీ ప‌ద‌వి నుండి త‌ప్పుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాదిలో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్ కు సంబంధించి ఐసీసీ షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు బీసీసీఐతో కూడా చ‌ర్చ‌లు జ‌రిపింది.

ఇందులో భాగంగా ఫైన‌ల్(ICC World Cup Final) , సెమీ ఫైన‌ల్ -1, సెమీ ఫైన‌ల్ -2 మ్యాచ్ ల తేదీల‌ను ఖ‌రారు చేసింది ఐసీసీ. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బీసీసీఐ స‌మ‌ర్పించిన నివేదిక‌ను ప‌రిశీలించిన ఐసీసీ మంగ‌ళ‌వారం ఆయా తేదీలు, ఆడే ప్రాంతాల‌ను వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ఈసారి ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్ ను గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ న‌వంబ‌ర్ 19న జ‌ర‌గ‌నుందని ఐసీసీ స్ప‌ష్టం చేసింది.

ఇక సెమీ ఫైన‌ల్ -1 న‌వంబర్ 15న వాంఖడే స్టేడియంలో కొన‌సాగుతుంది. సెమీ ఫైన‌ల్ -2 మ్యాచ్ న‌వంబ‌ర్ 16న కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌ర‌గ‌నుంద‌ని ఇంట‌ర్నేషన‌ల్ క్రికెట్ కౌన్సిల్ స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్ప‌టి నుంచే ఆయా మ్యాచ్ ల‌కు సంబంధించిన సెమీ ఫైన‌ల్స్ , ఫైన‌ల్(Final) మ్యాచ్ ఖ‌రారు కావ‌డంతో క్రికెట్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

Also Read : MLA Jagga Reddy : జ‌గ్గారెడ్డి ఘాటు కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!