Najam Sethi : ప్రభుత్వం చెబితే వరల్డ్ కప్ లో ఆడం – సేథీ
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షాకింగ్ కామెంట్స్
Najam Sethi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ లో వచ్చే ఏడాది 2023లో ఆసియా కప్ నిర్వహంచాల్సి ఉంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జే షా టీమిండియా ఆసియా కప్ లో ఆడబోదంటూ స్పష్టం చేశారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రజా.
తాజాగా ఆయనను తప్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రస్తుతం పీసీబీ చైర్మన్ గా కొలువు తీరారు నజామ్ సేథీ(Najam Sethi) . ఇదిలా ఉండగా భారత దేశంలో బీసీసీఐ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చేపట్టాల్సి ఉంది. అయితే భారత్ జట్టు గనుక పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ లో ఆడక పోతే తాము కూడా ఇండియాలో నిర్వహించే వన్డే ప్రపంచ కప్ లో ఆడాలా వద్దా అన్నది ఆలోచిస్తామన్నారు.
తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఒక వేళ పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గనుక వద్దని చెబితే తాము ఆడేందుకు వెళ్లబోమంటూ స్పష్టం చేశారు నజామ్ సేథీ. తాము వెళ్లాలా వద్దా లేదా అన్నది కేవలం సర్కార్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు.
ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ఈ తరుణంలో ఐసీసీ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే కావాలని తాము వెళ్లడం లేదనుకుంటే పొరపాటు పడినట్లేనని, అక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని తమ ఇంటెలిజెన్సీ వర్గాలు వెల్లడించాయని సాక్షాత్తు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ .
Also Read : నా వస్తువుల్ని తీసుకోనీయ లేదు