Imran Khan : భార‌త్ శ‌క్తివంతం అడ్డుకోవ‌డం క‌ష్టం

ప్ర‌శంసించిన పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్

Imran Khan : ఒక‌ప్ప‌టి పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్. ప్ర‌స్తుత పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి.

పాకిస్తాన్ నేష‌న‌ల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ద్దు చేయ‌డంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ విప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి.

దీంతో పిటిష‌న్ ను విచారించిన కోర్టు డిప్యూటీ స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తూ అవిశ్వాస తీర్మానం పున‌రుద్ద‌రించాల‌ని తీర్పు చెప్పింది. దీంతో కోర్టు నిర్ణ‌యం ప్ర‌కారం మ‌ళ్లీ త‌న‌ను తాను నిరూపించు కునేందుకు సిద్ద‌మ‌య్యాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి పాకిస్తాన్ దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప‌నిలో ప‌నిగా భార‌త దేశం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. ఇండియా శ‌క్తివంత‌మైన దేశ‌మ‌ని దానిని అడ్డు కోవ‌డం కష్ట‌మ‌న్నాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

త‌న‌ను గ‌ద్దె దించ‌డం వెనుక విదేశీ హ‌స్తం ఉందంటూ మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని వాపోయాడు.

త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జ‌రిగింద‌ని డిప్యూటీ స్పీక‌ర్ గుర్తించార‌ని, అంతే కాకుండా త‌న‌ను చంపేందుకు ప్లాన్ వేశారంటూ ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింద‌ని చెప్పాడు.

కానీ వీటిని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అయినా కోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని చెప్పాడు. ఈ విష‌యంలో పాకిస్తాన్ ఇండియాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌న్నాడు ఇమ్రాన్ ఖాన్.

అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ దేశం ప‌ట్ల అభిమానం క‌లిగి ఉంటార‌ని చెప్పాడు. ఈ దేశం మీ చేతుల్లో ఉంది. దీనిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌న్నాడు ప్ర‌ధాన మంత్రి.

Also Read : ర‌ష్యాపై భార‌త్ ఆధార ప‌డొద్దు

Leave A Reply

Your Email Id will not be published!