Imran Khan : విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న అనంతరం పాకిస్తాన్ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని డబ్బు సంచులు కాదన్నారు. ఇమ్రాన్ ఖాన్ మరోసారి విపక్షాలను టార్గెట్ చేశారు. తనను దించేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయంటూ ఆరోపించారు.
దేశం విధిని, ఫ్యూచర్ ను నిర్ణయించేది పాకిస్తాన్ ప్రజలే. జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కొట్టి వేసిన స్పీకర్ నిర్ణయం సరైనదేనని చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ నూరిని ప్రత్యేకంగా అభినందించారు.
తన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర కూలి పోయిందని చెప్పారు. ప్రజలు తమకు ఏం కావాలో నిర్ణయం తీసుకోవాలి. విదేశీయులు కాదు. ప్రజల మద్దతును డబ్బుతో కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితికి దారి తీసిందంటూ ఇమ్రాన్ ఖాన్Imran Khan) ఆరోపించారు.
తనను దించేందుకు మీరు తీసుకు వచ్చిన డబ్బు సంచుల్ని అనాథ శరణాలయాలు మొదలైన ధార్మిక సంస్థలు, కార్యక్రమాలకు పంచి పెట్టాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి. అసెంబ్లీలను రద్దు చేయాలని రాష్ట్రపతికి సూచించానని తెలిపారు.
ఇది ప్రజాస్వామ్య సమాజం. ఎన్నికలు జరగనీయండి. అప్పుడు ఎవరు నీతి పరులో తేలుతుందన్నారు. ప్రజలు తమకు ఎవరు కావాలనే దానిని వారే నిర్ణయించు కోనివ్వండి అంటూ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఇమ్రాన్ ఖాన్.
తనను లేపాలని చూశారని కానీ ఆఖరి బంతిని ఉపయోగిస్తానని చెప్పానని అన్నారు.
Also Read : శ్రీలంక సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం