Imran Khan Arrest Protest : పాక్ లో ఆందోళనలు అరెస్ట్ లు
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
Imran Khan Arrest Protest : పాకిస్తాన్ లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి , పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం కోర్టుకు హాజరైన సమయంలో అదుపులోకి తీసుకుంది పారా మిలటరీ ఫోర్స్ . దీంతో పార్టీ పరంగా దేశ వ్యాప్తంగా నిరసనలు(Imran Khan Arrest Protest) చేయాలని, ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇలా చేస్తే తాము ఊరుకోబోమని అరెస్ట్ లు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, అభిమానులు, పీటీఐ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారిందని సమాచారం. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 1,000 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడులకు దిగారని, ఆర్మీ హౌసెస్ పై కూడా రాళ్లు రువ్వారంటూ ఆరోపించారు.
ఈ మొత్తం ఆందోళనల్లో 170 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. భారీ ఎత్తున హింస చోటు చేసుకుందని, ఎక్కడికక్కడ నిరసనకారులను వెళ్ల నీయకుండా అడ్డుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ పై ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు. ఆ దేశంలో ఎవరు పీఎం, అధ్యక్షుడైనా ఆర్మీనే సుప్రీం. గత ఏడాది అనూహ్యంగా అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.
Also Read : ఇమ్రాన్ ఖాన్ లేచి పడిన కెరటం