Imran Khan : నాలుగు ఏళ్ల పాటు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా కొలువు తీరిన పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఊహించని రీతిలో అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. 172 ఓట్లు కావాల్సి ఉండగా 170 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
దీంతో రెండు (2) ఓట్ల తేడాతో తన ప్రధాని పదవిని కోల్పోయారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పీఎంగా ఉండేందుకు అనర్హుడని, ఆయన సంకీర్ణ మద్దతును కోల్పోయారని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. దీనిని డిప్యూటీ స్పీకర్ రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది.
ఈ తరుణంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో నో కాన్ఫిడెన్స్ ను ప్రవేశ పెట్టంది. ఇవాళ తెల్ల వారుజామున జరిగిన ఓటింగ్ ప్రాసెస్ లో తన పదవిని కోల్పోయారు. ఈ విషయాన్ని స్పీకర్ సాదిఖ్ డిక్లేర్ చేశారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. ఓటింగ్ సందర్భంగా మెజారిటీకి 172 మంది బలం కావాల్సి వచ్చింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కేవలం 170 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.
దీంతో కేవలం 2 ఓట్ల తేడాతో ఆయన తన ప్రధాన మంత్రి పదవిని కోల్పోయాయి. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగించారు. పూర్తిగా ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని,
దీని వెనుక అమెరికా ఉందని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ఆయన స్వదేశీ మీడియాపై కూడా ఆరోపణలు చేశారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పై మరియమ్ ఫైర్