GST Collections : సెప్టెంబర్ లో జీఎస్టీతో రూ. 1.47 లక్షల కోట్లు
జీఎస్టీ కలెక్షన్లలో పెరిగిన 26 శాతం ఆదాయం
GST Collections : భారత దేశంలో జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల సెప్టెంబర్ లోనే ఏకంగా 26 శాతం పెరగడం గమనార్హం. మొత్తంగా ఒక్క నెలలోనే రూ. 1.47 లక్షల కోట్లకు పైగా వసూళ్లయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఇదిలా ఉండగా వస్తు సేవల పన్నుల పన్నుకు(GST Collections) సంబంధించి వరుసగా ఏడు నెలలకు రూ. 1.40 లక్షల కోట్లకు పైగా ఉంది. సెప్టెంబర్ 2022 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,47,686 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 25,271 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్టీ రూ. 31,813 కోట్లు.
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 80,464 కోట్లు. (దిగుమతిపై సేకరించిన రూ. 41,215 కోట్ల వస్తువులతో సహా ). సెస్సు రూ. 10,137కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 856 కోట్లతో సహా వసూలైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇ-వే బిల్లుల సంఖ్య ఆగస్టు 2022లో దాదాపు 19 శాతం పెరిగి 65.89 మిలియన్ల నుండి 78.21 మిలియన్లకు పెరిగింది.
జూలై నెలలో 75.58 మిలియన్లతో పోలిస్తే ఇది దాదాపు 3.5 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో కలెక్షన్ ట్రెండ్ లు కచ్చితంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తాయి. గత ఆరు నెలల్లో వరుసగా జీఎస్టీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్ల మార్కు కంటే ఎక్కువగా ఉండడం విశేషం.
ప్రస్తుతం లక్షన్నర కోట్లను సాధారణ స్థితికి తీసుకు రావడమే ప్రభుత్వ ప్రయత్నమని ఆర్థిక శాఖ పేర్కొంటోంది.
Also Read : రూ. 678 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు