Smruti Panchal : ఫడ్నవీస్ భార్యపై అనుచిత కామెంట్స్
స్మ్రుతి పంచల్ ను అరెస్ట్ చేసిన పోలీస్
Smruti Panchal : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devender Fadnavis) భార్య పై ఫేస్ బుక్ లో అనుచిత కామెంట్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన మహిళకు కోలుకోలేని షాక్ తగిలింది.
గత రెండు సంవత్సరాలుగా ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్(Amruta Fadnavis) అధికారిక సోషల్ మీడియా పేజీలో నకిలీ ఖాతాలను ఉపయోగించింది. అంతే కాకుండా అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది.
దీనిపై తీవ్ర ఆందోళనకు గురైంది ఫడ్నవీస్ భార్య. ఈ మేరకు అభ్యంతరకరమైన, జుగుస్సాకరమైన, అనుచితమైన కామెంట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమృతా ఫడ్నవీస్ ను టార్గెట్ గా చేసుకుని ఏకంగా నిందితులు ఓ టీంగా ఏర్పడి 53 నకిలీ ఫేస్ బుక్ ఐడీలను (ఖాతాలను) సృష్టించినట్లు గుర్తించారు.
ఎట్టకేలకు దీనికి ప్రధాన సూత్రధారి అయిన స్మ్రుతి పంచల్(Smruti Panchal)ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు 50 ఏళ్ల వయస్సు ఉంది. అరెస్ట్ అయిన ఆమె గత రెండేళ్లుగా ఇదే పని మీద ఉందని తెలిపారు పోలీసులు.
బహుళ నకిలీ ఖాతాలను సృష్టించడం, ఆపై అభ్యంతకరమైన కామెంట్స్ , కంటెంట్ తో రెచ్చి పోవడం చేస్తూ వచ్చింది. పంచల్ మొత్తం 53 నకిలీ ఫేస్ బుక్ ఐడీలు తయారు చేసింది.
ఆపై 13 జీమెయిల్ ఖాతాలను సృష్టంచినట్లు తేలింది. కోర్టులో హాజరు పర్చడంతో గురువారం వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. స్మృతి పంచల్ పై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : గుర్తింపు కార్డులుంటేనే గర్భాద్ దర్శనం