Basudha Shrivastav : ఐడియాలు ఎన్నో కానీ వర్కవుట్ అయ్యేది కొన్నే. మరి బసుధ శ్రీవాస్తవ్ కలలు కన్నది అందరి లాగానే. కానీ తాను వాటిని ఆచరణలో పెట్టింది. ఇప్పుడు గణనీయమైన ఆదాయాన్ని పొందుతోంది.
మహిళా సాధికారతకు ఆమె ఓ దర్పణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2015లో బసుధ శ్రీ వాస్తవ్(Basudha Shrivastav) ఎక్స్ ప్రెస్ ఎర్త్ డిజిటల్ సర్వీసెస్ ను ఏర్పాటు చేశారు. దానికి ఆమె కో ఫౌండర్ గా ఉన్నారు.
మనం ఎక్కడికి వెళ్లినా మన ప్రయాణ అవసరాలన్నింటిని చూసుకునే ట్రావెల్ ఏజెన్సీ. తన సహ ఫౌండర్ హిమాన్షు నరులా కూడా ఆమె పాఠశాలలో సహ విద్యార్థి. వీరిద్దరూ ఒక సమయంలో ట్రావెల్ లో వెంచర్ ను ప్రారంభించాలని ఆసక్తి చూపారు.
వారు చేస్తున్న ఉద్యోగాలను విడిచి పెట్టారు. వ్యవస్థాపకత, మ్యారేజ్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఎక్స్ ప్రెస్ ఎర్త్ ట్రావెల్ ఏజెన్సీ బీ2బీ, బీ2సీ క్లయింట్ల కోసం హోటళ్లు, కార్లు, విమానాలు, బీమాతో పాటు ఇతర సౌకర్యాలన్నింటిని సదరు ఏజెన్సీ చూసుకుంటుంది.
ఇక నిశ్చింతగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. బసుధ శ్రీవాస్తవ్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
ఐటీ రంగంలో చేసిన అనుభవం కూడా ఉంది. ఆమె కంపెనీ అందించిన సేవలకు గాను మోస్ట్ ఇన్నోవేటివ్ ట్రావెల్ మేనేజ్ మెంట్ కంపెనీతో సహా వినూత్న ట్రావెల్ కంపెనీగా అనేక అవార్డులను గెలుచుకుంది.
ఒకప్పుడు ఏం చేయాలో తెలిసేది కాదు. కానీ ఇవాళ ఒక్క చిన్న అవసరం ఐడియాగా మారింది. అదే విజేతగా నిలిపింది అంటోంది బసుధ. .
Also Read : రుతుక్రమంపై ‘అదితి’ అవగాహన