IND vs AUS Day 2 2nd Test : ఆదుకున్న అశ్విన్ రాణించిన‌ ప‌టేల్

భార‌త్ 262 ప‌రుగుల‌కు ఆలౌట్

IND vs AUS 2nd Day 2 Test : ఢిల్లీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం మైదానంలోకి దిగిన భార‌త జ‌ట్టు ఒక్క ప‌రుగు తేడాతో 262 ర‌న్స్ కు ప‌రిమిత‌మైంది.

చివ‌ర‌గా ఆసిస్ బౌల‌ర్ కుహ్నేమాన్ అద్భుత బంతికి ష‌ఫీని సాగ‌నంప‌డంతో ఇండియా క‌థ ముగిసింది. ఒకానొక ద‌శ‌లో టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో ర‌విచంద్ర‌న్ అశ్విన్ , అక్షర్ ప‌టేల్ ప‌రువు పోకుండా కాపాడారు. ఏకంగా ఇద్ద‌రూ క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు తీయించారు.

ర‌వి చంద్ర‌న్ అటు బౌలింగ్ తో పాటు ఇటు బ్యాట‌ర్ గా కూడా మ‌రోసారి మెరిపించాడు. 37 ర‌న్స్ చేశాడు. ఇక అక్ష‌ర్ పటేల్ సూప‌ర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. కీల‌క‌మైన పాత్ర పోషించాడు. ఏకంగా 74 ప‌రుగులు చేసి ఔరా అనిపించాడు. టాప్ బ్యాట‌ర్లు చేతులెత్తేస్తే వీరిద్ద‌రూ పొందిక‌గా ప‌రుగులు చేస్తూ పోయారు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్ లో కొత్త బంతి చిచ్చు రేపింది.

ఆస్ట్రేలియా బౌల‌ర్లు వెంట వెంట‌నే ర‌విచంద్ర‌న్ అశ్విన్ తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ ను సాగ‌నంప‌డంతో భార‌త్ వికెట్ల ప‌త‌నం(IND vs AUS 2nd Day 2 Test) మ‌ళ్లీ మొద‌లైంది.

ఇక ఆసిస్ బౌల‌ర్ల‌లో ల‌యాన్ ల‌యాత్మ‌కంగా తిప్పేశాడు. ఏకంగా 5 వికెట్లు కూల్చాడు. కుహ్నేమాన్ , మ‌ర్పీ చెరో రెండు వికెట్లు ప‌డగొట్టారు. ఇక ఆసిస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కు ఒక వికెట్ ద‌క్కింది. ఇక అశ్విన్ , ప‌టేల్ క‌లిసి కీల‌క‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. వీరిద్ద‌రూ క‌లిసి 114 ర‌న్స్ చేశారు. నాగ్ పూర్ టెస్టులో నిరాశ ప‌ర్చిన కోహ్లీ ఈసారి 44 ప‌రుగులు చేశాడు.

Also Read : రాజ‌స్థాన్ కు స్టార్ పేస‌ర్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!