IND vs AUS 3rd Test : జడేజా మ్యాజిక్ ఖవాజా సూపర్
తొలి రోజు ఆస్ట్రేలియా 156/4
IND vs AUS Test : ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రసపట్టులో కొనసాగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన టీమిండియా 109 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక భారత జట్టులో శుభ్ మన్ గిల్ 21 రన్స్ చేస్తే , రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు.
మిగతా వాళ్లు ఎవరూ అంతగా ప్రభావం చూపలేదు. పుజారా 1 , అయ్యర్ సున్నాకే వెనుదిరిగారు. ఇక మాజీ కెప్టెన్ కోహ్లీ 22 రన్స్ మాత్రమే చేశాడు. మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సైతం పరుగులు (IND vs AUS Test) చేసేందుకు ఇబ్బంది పడింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా ఆడాడు. స్కోర్ మెల మెల్లగా పెరిగేలా చూశాడు. 60 రన్స్ చేశాడు. ఖవాజా లాబుస్ చాగ్నేతో కలిసి రెండో వికెట్ కు 96 పరుగులు జోడించారు.
ఈ సీరీస్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కేమరూన్ 6 పరుగులకే వెను దిరిగాడు. పీటర్ హ్యాండ్స్ కాంబ్ 7 రన్స్ చేసి జడేజా చేతికి చిక్కాడు. మరోసారి రవీంద్ర జడేజా తన బంతులతో మ్యాజిక్ చేశాడు. ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. కోల్పోయిన నాలుగు వికెట్లను జడ్డూ తీయడం విశేసం. ఇదిలా ఉండగా నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులో, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ ను తీసుకుంది భారత్ జట్టు.
Also Read : 109 పరుగులకే భారత్ ఆలౌట్