IND vs AUS 3rd Test : ఆస్ట్రేలియా 197 ఆలౌట్

ర‌స‌ప‌ట్టులో మూడో టెస్టు

IND vs AUS Day 2 3rd Test : ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టికే నాగ్ పూర్ , ఢిల్లీ టెస్టుల్లో భార‌త్ విజ‌యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో 109 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 39 ర‌న్స్ చేసింది క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. మొద‌టి రోజు ర‌వీంద్ర జ‌డేజా 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 11 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 88 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా(IND vs AUS Day 2 3rd Test). మొత్తంగా ఈ మైదానంలో స్పిన్న‌ర్లు త‌మ స‌త్తా చాటారు.

తొలి రోజు ఆట‌ను 4 వికెట్లు కోల్పోయి 156 ర‌న్స్ చేసిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. పాట్ క‌మిన్స్ గైర్హాజ‌ర్ తో అత‌డి స్థానంలో స్టీవ్ స్మిత్ ప్ర‌స్తుతం మూడో టెస్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

కేవ‌లం 41 ప‌రుగులు మాత్ర‌మే జోడించింది ఆస్ట్రేలియా. చివ‌ర‌కు 6 వికెట్ల‌ను పారేసుకుంది. మొద‌టి రోజు ర‌వీంద్ర జ‌డేజా స‌త్తా చాటితే రెండో రోజు ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ఉమేష్ యాద‌వ్ లు క‌లిసి ఆసిస్ ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఇద్ద‌రూ చెరో మూడు వికెట్లు తీశారు.

ఇదిలా ఉండ‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్ జ‌ట్టు కీల‌క‌మైన రెండు వికెట్ల‌ను కోల్పోయింది. కేవ‌లం 39 ర‌న్స్ చేసింది. రోహిత్ శ‌ర్మ 12 ప‌రుగులకు , శుభ్ మ‌న్ గిల్ 5 ప‌రుగుల‌కే వెనుదిరిగారు. క్రీజులో పుజారా ,కోహ్లీ ఆడుతున్నారు. 250కి పైగా ర‌న్స్ సాధిస్తే ఆసిస్ పై విజ‌యం సాధించే ఛాన్స్ ఉంటుంది.

Also Read : అంద‌రి క‌ళ్లు ఆ ఐదుగురి పైనే

Leave A Reply

Your Email Id will not be published!