IND vs AUS 4th Test : సత్తా చాటిన కోహ్లీ భారత్ భారీ స్కోర్
571 రన్స్ కు ఆలౌట్..91 రన్స్ ఆధిక్యం
IND vs AUS Virat Kohli : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచింది. 91 పరుగుల ఆధిక్యాన్ని చాటింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ 480 రన్స్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 571 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సత్తా చాటాడు. 180 పరుగులతో దుమ్ము రేపాడు. కామెరాన్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక భారత జట్టులో ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగితే స్టార్ బ్యాటర్ రన్ మెషీన్ గా పేరొందిన టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో అలరించాడు. 2022లో బంగ్లాదేశ్ తర్వాత సెంచరీ చేశాడు. తన కెరీర్ లో ఇది 28వ సెంచరీ కాగా మొత్తంగా ఇది 75వ సెంచరీ కావడం విశేషం. విరాట్ కోహ్లీ 186 రన్స్ చేశాడు. 14 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.
కోహ్లీకి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సహకరించాడు. ఆఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ(IND vs AUS Virat Kohli) స్కోర్ సాధించింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఒకవేళ త్వరగా ఆసిస్ ను ఆలౌట్ చేస్తే టీమిండియా గెలుపొందే ఛాన్స్ ఉంది. రేపటితో ఏం జరుగుతుందో తేలనుంది.
ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ నాగ్ పూర్ , ఢిల్లీ టెస్టులో విజయం సాధిస్తే ఇండోర్ వేదికగా మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆసిస్ గెలుపొందింది.
Also Read : ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు