IND vs AUS 4th Test : గిల్ సెంచరీ భారీ స్కోర్ దిశగా భారత్
రసవత్తరంగా మారనున్న చివరి టెస్ట్
IND vs AUS Day 3 4th Test : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ దిశగా వెళుతోంది. ప్రత్యర్థి జట్టు 480 పరుగులకు తన ఇన్నింగ్స్ ను ముగించింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా(IND vs AUS Day 3 4th Test) కడపటి వార్తలు అందేసరికి 2 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సత్తా చాటాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు.
క్రీజు వద్ద టీ సమయానికి 103 రన్స్ తో ఉన్నాడు. అద్భుతంగా ఆడాడు. ఇంకా 292 పరుగులు వెనుకబడి ఉంది భారత జట్టు. ఇక ఛెతేశ్వర్ పుజారా టీకి ముందు చివరి ఓవర్ లో ఔట్ అయ్యాడు. మధ్యలో గిల్ తో జత కట్టిన విరాట్ కోహ్లీ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు.
అంతకు ముందు 3వ రోజు ఉదయం సెషన్ లో 34 రన్స్ వద్ద భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆస్ట్రేలియానుమొదట 480 రన్స్ కు కట్టడి చేసిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోలేదు.
ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయింది. ఒకరు ఓపెనర్ రోహిత్ శర్మ, మరొకరు ఛతేశ్వర్ పుజారా. ఇక ఆసిస్ జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దంచి కొట్టాడు. 180 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టుకు చెందిన గ్రీన్ కామెరాన్ 113 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇంకా టెస్టు మ్యాచ్ ఫలితం తేలేందుకు సమయం ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టులలో 2 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధిస్తే ఆస్ట్రేలియా ఢిల్లీలో గెలుపొందింది 9 వికెట్ల తేడాతో.
Also Read : ఆర్సీబీ పరాజయాల పరంపర