IND vs AUS 4th Test : ఆసిస్ ను ఆదుకున్న ఖవాజా
104 రన్స్ తో నాటౌట్ ఉస్మాన్
IND vs AUS Day1 Innings : గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోర్ సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దుమ్ము రేపాడు. ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో ఖవాజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా జరుగుతున్న కీలక టెస్టులో ఖవాజా మరోసారి సత్తా చాటాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఖవాజా.
గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో ఖవాజా 104 పరుగులతో నాటౌట్ గా (IND vs AUS Day1 Innings) నిలిచాడు. ఓపికగా ఉంటూ జట్టును ఆదుకున్నాడు. వికెట్లు కోల్పోయినా ఎక్కడా తొట్రుపాటుకు లోను కాలేదు. పరుగులు చేస్తూ వెళ్లాడు. జట్టు స్కోర్ పెరిగేలా చేశాడు ఉస్మాన్ ఖవాజా. భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 38 పరుగులు చేస్తే ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 49 రన్స్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు .
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా , రవి చంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా స్కిప్పర్ స్టివ్ స్మిత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం సరైనదేనని భారీ స్కోర్ దిశగా పరుగులు చూస్తోంది. ట్రావిస్ హెడ్ 32 రన్స్ చేస్తే లబుషేన్ 3 రన్స్ ఔట్ అయ్యాడు. 72 రన్స్ కే 2 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును స్మిత్ , ఖవాజా ఆదుకున్నారు.
Also Read : నా హృదయం క్రికెట్ మయం – మోదీ